భారత్‌ కరోనా అప్‌డేట్‌.. నిన్నటితో పోలిస్తే 13 శాతం పెరిగిన కేసులు

భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం 6,050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని

By అంజి  Published on  7 April 2023 5:30 AM GMT
Covid-19 cases, India, Health Minister Mansukh Mandaviya

భారత్‌ కరోనా అప్‌డేట్‌.. నిన్నటితో పోలిస్తే 13 శాతం పెరిగిన కేసులు

భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం 6,050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. వైరస్ కారణంగా భారతదేశంలో మరో 14 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది. ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,41,85,858గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారంవారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

కోవిడ్ కేసుల పెరుగుదల మధ్య.. ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి నేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. "కోవిడ్-19పై కేంద్రం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ప్రధాని మోదీ దీనిపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. నేడు, ఆరోగ్య మంత్రి మాండవ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు" అని MoS హెల్త్ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్‌ తెలిపారు.

Next Story