హిమాచల్ ప్రదేశ్‌లో జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

By సుభాష్  Published on  25 May 2020 8:32 PM IST
హిమాచల్ ప్రదేశ్‌లో జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

భారత్ లో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడి అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నా.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగించింది.

కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 214 కరోనా వైరస్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటి వరకూ 63 మంది కోలుకున్నారు. ఐదుగురు మరణించారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్‌ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలింపులు ఇస్తున్న క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌ లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధిక కేసులు నమోదువుతున్న మహారాష్ట్ర పొడిగించాలని ఆలోచిస్తోంది.

చైనాలో పట్టిన ఈ వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 55 లక్షల మందికిపైగా ఈ వైరస్‌ బారిన పడ్డారు. దాదాపు మూడున్నర లక్షల మంది మృతి చెందారు. ఇక భారత్‌ ముందస్తుగా అప్రమత్తమై మార్చి 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దశల వారీగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు నాలుగో దశ కొనసాగుతోంది.

Next Story