హైదరాబాద్‌: డెంగ్యూ మరణాలపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. మనుషులు చనిపోతున్నా పట్టించుకోరా అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణ చర్యలపై ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ముందు ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీస్‌ హాజరయ్యారు. ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారని హైకోర్టు మండిపడింది. 3,800 కేసులు నమోదు అయితే ప్రభుత్వం తక్కువ కేసులు చూపెడుతుంది. చీఫ్‌ సెక్రెటరీతో సహా మీరందరూ మూసీ నదిని పరశీలించాలని హైకోర్టు ఆదేశించింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లు కూడా నది మధ్యలోనే ఉన్నాయి.. అక్కడ లేని డెంగ్యూ మరణాలు ఇక్కడ ఎందుకుని హైకోర్టు ప్రశ్నించింది. మూసీని అనుకొని ఉన్న హైకోర్టులోనే దోమలు ఉన్నాయంది. జనవరిలో 85 కేసులుంటే అక్టోబర్‌ నాటికి 3,800 కేసులు ఎలా పెరిగాయని సీఎస్‌ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. సీఎస్‌ లెక్కలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రభుత్వం విఫలం అయితే మృతుల కుటుంబాలకు రూ.50 చెల్లించాలని హైకోర్టు హుకుం జారీ చేసింది. కాగా డెంగ్యూపై హైకోర్టులో సీఎస్‌ వివరణ ఇస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.