ఆర్టీసీ సమ్మెపై మరోసారి హైకోర్టులో విచారణ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 5:51 AM GMT
ఆర్టీసీ సమ్మెపై మరోసారి హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరింది. అయితే దీనిపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా ప్రభత్వం, ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలు తమ వైపు వాదనలు వినిపించనున్నారు. అయితే ప్రభుత్వం.. కార్మికులతో ఎందుకు చర్చలు నిర్వహించలేదనేదానిపై కోర్టుకు స్పష్టత ఇవ్వనుంది. అటు జేసీఏ నేతలు మాత్రం కోర్టు తీర్పు అనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే అటు వైపు కార్మికులు ఏమాత్రం సమ్మెకు తగ్గడంలేదు. అయిన ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగడంలేదు. దీంతో ఈరోజు కోర్టు ఏం చెబుతుందన్నది సర్వత్ర ఆసక్తిగా మారింది. అయితే సీఎం ఇప్పటికే అధికారులకు కోర్టులో వినిపించాల్సిన వాదనలపై పలు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

Next Story