ఆర్టీసీ సమ్మెపై కోర్టులో ఎడతెగని వాదనలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 8:13 AM GMT
ఆర్టీసీ సమ్మెపై కోర్టులో ఎడతెగని వాదనలు..!

నేడు మరోసారి హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఆర్టీసి సమ్మె పై వాదనలు విననున్న హైకోర్టు.. సమ్మెపై తీసుకునే నిర్ణయం కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. కాగా.. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఇప్పటికే 27 రోజులకు చేరుకుంది. కానీ..విలీనం విషయంలోమాత్రం అటు ప్రభుత్వం కానీ.. ఆర్టీసీ సంఘాలు కానీ..తగ్గకపోవడంతో దానిపై హైకోర్టు దృష్టి పెట్టాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 28న ప్రభుత్వం అందించిన నివేదిక పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. అధికారులు నిజాలు దాచి పెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ముందు నిజాలు చెప్పాలని.. బకాయిల అంశంపై కోర్టుకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆర్టీసీ ఎండి.. సంస్థ ఆర్థిక విషయాలు పూర్తిగా తెలిసినా వ్యక్తిని హాజరుపరచాలంటూ కోర్టు సూచించింది. అయితే కార్మిక సంఘాలకు చురకలు వేస్తూనే.. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. సమ్మెపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం. కోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Next Story