ఈ నెల 25వ తేదీన ఎంఐఎం తలపెట్టిన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని షరతులతో సభకు అనుమతి ఇచ్చింది. నగరంలో ఎలాంటి ర్యాలీ చేయకూడదని, కేవలం సభ మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశించింది. జనవరి 25వ అర్ధరాత్రి సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం చార్మినార్ ప్రాంతంలో ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. దీనికి పోలీసులు కూడా అనుమతిచ్చారు.

అయితే.. రిపబ్లిక్‌ డేకు ముందు రోజు ఎంఐఎం సభకు అనుమతి ఇవ్వొద్దంటూ.. ఉమమహేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. షరతులతో ఎంఐఎం సభకు పర్మిషన్‌ ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపింది. సభ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలంటూ తెలంగాణ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఎక్కడా అల్లర్లు జరగకుండా చూడాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.