డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 6:33 AM GMT
డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ నివారణపై తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ సెక్రటరీ పనితీరు సరిగాలేదని తప్పుపట్టింది. నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది.

డెంగీ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు తీసుకున్న చర్యలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొంది. జ్వారాల సీజన్ అయిపోయేక చర్యలు తీసుకుంటారా..?అని అధికారులను ప్రశ్నించింది.

అనంతరం నవంబరు 14లోగా పూర్తి వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది.

Next Story