రూ.40 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత.. పోలీసుల తనిఖీలో డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు

By సుభాష్  Published on  24 Jun 2020 2:38 AM GMT
రూ.40 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత.. పోలీసుల తనిఖీలో డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు

దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్‌ పట్టుబడింది. మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఈ డ్రగ్‌ రాకెట్‌ గుట్టరట్టయింది. ఢిల్లీలోని నిగంబోధ్‌ ఘాట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, 10 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్‌ను లారీలో తీసుకెళ్తుండగా, లారీని పోలీసులు తనిఖీ చేశారు. దీంతో లారీని సీజ్‌ చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ హెరాయిన్‌ రూ. 40 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇంత విలువైన హెరాయిన్‌ పట్టుబడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హెరాయిన్‌ను ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకెళ్తున్నారు..దీని వెనుక ఇంకెంత మంది హస్తం ఉందనే దానిపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు.

Next Story
Share it