సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హేజా’. వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్), ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవ‌ల‌ విడుదలై మంచి రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా..

దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ… ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన నేను ఫస్ట్ టైమ్‌ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా `హేజా ‘ .. ఒక మ్యూజికల్ హారర్ గా అధ్బుతమైన కథాంశంతో రాబోతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు ఆర్.ఆర్ హైలెట్ గా నిలవనుంది. టెక్నికల్ గా హై రేంజ్ లో ఉండే చిత్రం. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్, డాల్బీమిక్సింగ్ తో రూపొందుతోంది. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నామని తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.