అమృతని చూసాక విరాట్‌కి ఏమైంది..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2020 7:13 AM GMT
అమృతని చూసాక విరాట్‌కి ఏమైంది..?

'ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం. కానీ ఆ టైం వచ్చినప్పుడు మరీ.. 'అని ఆదివారం ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్టు పెట్టాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌. ఆ విషయాన్ని సోమవారం ఉదయం 10గంటలకు చెబుతానని చెప్పాడు. తన బ్యాచిలర్‌ లైఫ్ ఎండ్‌ అంటూ ఓ వీడియో కూడా పోస్టు చేశాడు. దీంతో చాలా మంది సాయి ధరమ్‌ తేజ్‌కు పెళ్లి అయిపోతోందని అనుకున్నారు. కానీ ట్విస్ట్‌ ఇచ్చాడు తేజు.

‘ప్రతి రోజు పండగే’ చిత్రంతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను అందుకున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్‌'. సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌తోపాటు ‘నో పెళ్లి’ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.‘అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకే సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ???.. సోలో బ్రుతుకే సో బెటర్‌ సినిమా నుంచి ఆగష్టు 26న ‘హెయ్‌ ఇది నేనేనా’ అనే పాట విడుదల కానుంది’ అంటూ ట్విట్‌ చేశాడు.

వాస్తవానికి ఈ చిత్రం మే 1న విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకోగానే త్వరలోనే విడుదల కానుంది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజు సరసన నభా నటేష్ నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.Next Story