ఈ వయసులోనే గోడలు దూకేస్తున్న హీరోయిన్..!
By అంజి Published on 26 Jan 2020 1:06 PM ISTబాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన లవ్ ఆజ్ కల్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బిజీ బిజీగా గడుపుతోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్‌లలోకి రానుంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి సారా అలీ ఖాన్ నటిస్తోంది.
కాగా, ఇటీవల సారా అలీ ఖాన్ తనకు సంబంధించిన ఫోటోలను 'లవ్ ఆజ్ కల్' సెట్స్ నుండి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ తన అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సారా అలీ ఖాన్ గేట్ ఎక్కి మరీ ఫోటో గ్రాఫర్లకు పోజులిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ హాయిగా జీవించండి, మరింత నవ్వండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్ ఈ ఫోటోలు ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో సారా అలీఖాన్ తెలుపు, నేవీ బ్లూ కలర్ క్రాప్ టాప్, డెనిమ్ జీన్స్ ధరించింది.
సారా అలీఖాన్ ప్రస్తుతం నటిస్తున్న లవ్ ఆజ్ కల్ చిత్రంలో ప్రముఖ నటులు రణదీప్ హుడా, ఆరుషి శర్మలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, సారా అలీఖాన్ ఫోటోలపై ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొదరు ఎప్పటిలానే సో ఫన్నీ, క్యూ అంట్ అంటూ కామెంట్స్ చేయగా, మరికొందరు ఇప్పుడే గోడలు దూకడం అంత మంచిది కాదంటూ కామెంట్స్ బాక్స్‌లను నింపేస్తున్నారు. ఏదేమైనా సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్‌ల లవ్ ఆజ్ కల్ కోసం బాలీవుడ్ జనాలు ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.