యశ్ అభిమానులు తగ్గట్లేదుగా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jan 2020 4:50 PM GMT
యశ్ అభిమానులు తగ్గట్లేదుగా..

కేజీఎఫ్ చిత్రంతో భారత దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కన్నడ హీరో యశ్. కన్నడ, తెలుగు, హింది, తమిళనాట కేజీఎఫ్ తో పలు రికార్డులను తిరగరాశాడు ఈ రాకింగ్ స్టార్. ప్రస్తుతం ఈ చిత్రం రెండో భాగం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్సాహాంతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన చిన్న విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా ఈ యువ హీరో పుట్టిన రోజు నేడు. మామూలుగా స్టార్ హీరోలా పుట్టిన రోజును పండుగలా జరుపుకుంటారు ఆ హీరోల అభిమానులు. కేక్స్ కట్ చేయడం, రక్తదానం చేయడం వంటివి చూస్తుంటాం. మైనింగ్ మాఫియాతో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో యశ్ బర్త్ డే కేక్ ను కూడా అంతే రికార్డు సృష్టించనుంది.

100 కేజీలు కాదు వెయ్యి కేజీలు కాదు ఏకంగా 5 వేల కేజీల కేక్ ను యశ్ అభిమానులు కట్ చేసేందుకు సిద్దం చేశారు. ఇప్పటి వరకు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ హీరో అభిమానులు కూడా ఈ స్థాయిలో సెలబ్రేట్ చేసింది లేదు. బెంగళూరులోని ప్రముఖ ఆడిటోరియం లో ఇప్పటికే ఈ కేక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు మరియు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్న వేడుకలో ఈ కేక్ ను కట్ చేసి యశ్ బర్త్ డే వేడుక జరుపబోతున్నారు.

ఇదిలా ఉండగా యశ్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్-2 చిత్ర టీజర్ ను విడుదల చేస్తామని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర టీజర్ను విడుదల చేయలేకపోతున్నామని చిత్రబృందం తెలియజేసింది. అయితే యశ్ అభిమానులు నిరుత్సాహాపడకుండా యశ్ లుక్ ను విడుదల చేసింది. ఈ న్యూ లుక్ లో యశ్ ను చూస్తే మతి పోతోంది. చేతిలో సుత్తి పట్టుకుని కోపంగా చూస్తున్నాడు. 1986 నుంచి రాకింగ్ స్టార్ అని రాయడంతో పాటు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఈ ఫోటో.

Next Story
Share it