విజయ దేవరకొండతో ఎక్స్‌పీరియన్స్ గురించి రాశీఖన్నా..
By Newsmeter.Network Published on 26 Dec 2019 6:51 PM ISTవెంకీ మామా, ప్రతిరోజు పండగే వంటి వరుస విజయాలతో దూసుకు పోతున్న హీరోయిన్ రాశీఖన్నాను తాజాగా మీడియా పలుకరించింది. ఈ సందర్భంలోనే విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతోపాటు తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు..? ఫేవరేట్ యాక్టర్ ఎవరు..? అన్న ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలను చెప్పుకొచ్చింది.
ముందుగా, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ వరల్డ్ ఫేమస్ లవర్ గురించి మాట్లాడిన రాశీకన్నా హీరో విజయ్ దేవరకొండతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉందని, అతనితో చాలా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అంటూనే హీ ఈజ్ థియేట్రికల్ యాక్టర్ అంటూ కితాబిచ్చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాబులస్ యాక్టర్ అన్న విషయం సెట్‌లో అతన్ని గమనిస్తే తెలుస్తుందని రాశీఖన్నా చెప్పుకొచ్చింది.
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం కోసం ఇద్దరం కలిసి బాగా కష్టపడుతున్నాం. ఇప్పటికే చాలా హార్డ్‌వర్క్ చేశాం. ఇంకా చేస్తాం కూడా. నిజంగా సీన్స్‌లో విజయ దేవరకొండ యాక్టింగ్ రియల్లీ గుడ్. రియల్లీ వెల్ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాకుండా, ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ జనవరిలో రిలీజ్ చేస్తారని, ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పానంటూ మీడియాకు తెలియజేసింది.
టాలీవుడ్‌కు వచ్చాక తెలుగు భాషను పూర్తిగా నేర్చేసుకున్నా. ఒక ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు.. ఆ ప్రాంతానికి సంబంధించిన భాషను నేర్చుకోవడమన్నది అక్కడి ప్రజలకు ఇచ్చే గౌరవంగా భావిస్తా. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా తెలుగులోనే మాట్లాడుతా. ఆ కారణంగా చాలా మంది నన్ను తెలుగు అమ్మాయినని అనుకుంటుంటారు. సినీ ఇండస్ట్రీలో నాకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కతే హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలుస్తుంటుంది.
అలాగే సమంత గురించి మాట్లాడిన రాశీఖన్నా ఎమోషనల్ సీన్స్‌లలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అమేజింగ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. ఈ విషయాన్నే తెలియజేస్తూ యు డిడ్ గ్రేట్ జాబ్, ఇలా ఎలా చేయగలిగావు..? అంటూ సమంతకు చాలాసార్లు మెసేజ్‌కూడా పెట్టా. సమంత యాక్టింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. పాయల్ రాజ్‌పుత్‌తో చేసినట్టే సమంతో కూడా ఒక మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఇక విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక జెంటిల్‌మేన్. స్పెషల్లీ ఆయన నుంచి రియల్ లైఫ్, రీల్ లైఫ్‌కు తేడా తెలుసుకున్నానంటూ మీడియా ప్రతినిధులతో తన మాటామంతిని ముగించేసింది రాశీఖన్నా.