త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు గాయం..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 10:26 AM IST
త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు గాయం..!

త‌మిళ స్టార్ హీరో సూర్యకు గాయమైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సూర్య వ‌ర్కౌట్స్ చేస్తుండ‌గా ఆయ‌న ఎడ‌మ చేతికి గాయ‌మైన‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తిచేసిన సూర్య ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక కథానాయకిగా నిర్మించిన పొన్‌మగళ్‌ వందాళ్‌ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది.

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమితం అయ్యాడు సూర్య‌. త‌దుప‌రి సినిమా కోసం ఇంట్లోనే వ‌ర్కౌట్స్ చేస్తుండ‌గా.. గాయమైన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని సూర్య స‌న్నిహితులు నిర్ధారించారు. ఆయ‌న ఆస్ప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నార‌ని, 90శాతం గాయం న‌యమైన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో సూర్య అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ అభిమాన న‌టుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. దీనిపై సూర్య కూడా దీనిపై స్పందించారు. తనకు పెద్ద‌గాయాలు ఏమీ కాలేద‌ని, చిన్న గాయ‌మేన‌ని, అభిమానులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచించారు.

లాక్‌ డౌన్‌ పూర్తి కాగానే హరి దర్శకత్వంలో అరువా చిత్ర షూటింగ్‌లో సూర్య పాల్గొన‌నున్నారు. ఇక సూర్య‌కు త‌మిళంలోనే కాక తెలుగులోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆయ‌న న‌టించిన సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Next Story