సిద్ధార్థ్ నాడు త‌ప్పు చేసాడు.. నేడు..?

By Newsmeter.Network  Published on  10 Dec 2019 5:53 AM GMT
సిద్ధార్థ్ నాడు త‌ప్పు చేసాడు.. నేడు..?

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మ‌రిల్లు, కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం, ఓయ్, ల‌వ్ ఫెయిల్యూర్ త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు సిద్ధార్థ్. అన‌తి కాలంలోనే తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. అయితే.. వ‌రుస‌గా విజ‌యాలు రావ‌డం వ‌ల‌న.. ఇక మీడియాతో మ‌న‌కు ప‌నేంటి..? అనుకున్నాడో ఏమో కానీ... త‌న సినిమాని విమ‌ర్శించార‌ని న్యూస్ ఛాన‌ల్స్ పై అప్ప‌ట్లో ఫైర్ అయ్యాడు.

ఎంత‌లా ఫైర్ అయ్యాడంటే... న్యూస్ ఛాన‌ల్స్ లో రేటింగ్ కోసం ఎంత‌కైనా తెగిస్తారు అంటూ వాళ్లు బాధ‌ప‌డేలా కాస్త సీరియ‌స్ గానే కామెంట్ చేసాడు. అది వివాద‌స్ప‌దం అవ్వ‌డం.. అప్ప‌ట్లో ఆ.. వివాదం దాస‌రి గారు, దిల్ రాజు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం.. ఆత‌ర్వాత సిద్ధార్థ మీడియాకి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం జ‌రిగింది. ఇక అప్ప‌టి నుంచి తెలుగులో అవ‌కాశాలు రాలేదో... లేక తెలుగు సినిమా పై కాన్ స‌న్ ట్రేష‌న్ త‌గ్గించాడో కానీ.. సిద్ధార్థ్ తెలుగులో అంత‌గా సినిమాలు చేయ‌లేదు. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని త‌పిస్తున్నాడు.

ఇటీవ‌ల‌ గృహం సినిమాతో ఆక‌ట్టుకున్న సిద్ధార్థ మ‌రో వైవిధ్య‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను మెగా హీరో వ‌రుణ్ తేజ్ రిలీజ్ చేసారు.

సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 2020 ఫిబ్రవరి లో ఈ మూవీని విడుదల చేయ‌డానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి.. ఈ సినిమాతో సిద్ధార్థ్ మ‌ళ్లీ తెలుగులో స‌క్స‌స్ సాధిస్తాడేమో చూడాలి.

Next Story