నూర్ అహ్మద్ కుటుంబానికి రామ్ చరణ్ పది లక్షల విరాళం
By Newsmeter.Network Published on 9 Dec 2019 5:52 PM ISTగ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఆకస్మిక మరణ వార్తకు ‘మెగా’ కుటుంబం వెంటనే స్పందించింది. విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి నూర్ అహ్మద్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ అందుబాటులో లేకపోవడంతో నిన్న వెళ్ళలేకపోయారు. కొద్దిసేపటి క్రితం రామ్‌చరణ్ ఒక ప్రకట చేస్తూ తాను హైదరాబాద్ రాగానే నూర్ అహ్మద్ కుటుంబాన్నికలుస్తానని తెలిపారు. నూర్ ఆహ్మద్ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.‘
నూర్ అహ్మద్ గారు మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. ఆయన మా పేరు మీద ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా హాస్పిటల్‌కు వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు. మెగా బ్లడ్ బ్రదర్ నూర్ అహ్మద్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని సంతాపాన్ని ప్రకటించారు.