'మా' ఉపాధ్యక్ష పదవికి హీరో రాజశేఖర్‌ రాజీనామా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jan 2020 1:14 PM GMT
మా ఉపాధ్యక్ష పదవికి హీరో రాజశేఖర్‌ రాజీనామా

మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ (మా) ఉపాధ్యక్ష పదవికి హీరో రాజశేఖర్‌ రాజీనామా చేశారు. గురువారం ఉదయం పార్క్‌ హయత్‌లో జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. 'మా' లో నెలకొన్న విబేధాలపై రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజశేఖర్‌ వ్యాఖ్యలపై సీనియ‌ర్లు చిరంజీవి, మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా 'మా' ని కోరారు.

ఈ నేపథ్యంలో జీవిత వేదికపైకి వచ్చి రాజశేఖర్‌ వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. రాజశేఖర్ ది చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వమ‌ని మనస్సులో ఏది ఉంటే అది చెప్పేస్తారన్నారు. 'మా' లో సమస్యలు ఉన్నాయి. చిరంజీవి ముందుండి నడిపించాలని జీవిత‌ కోరారు. తాము చిరంజీవి వెనుకే ఉంటామన్నారు. ఇకపై కూడా తామందరం కలిసి 'మా'లో పనిచేయాలని కోరుకుంటున్నట్లు జీవిత పేర్కొన్నారు. ఈ నేఫ‌థ్యంలో రాజ‌శేఖ‌ర్ రాజీనామా ప్రాథాన్య‌త సంత‌రించుకుంది.

R1 R2

Next Story