నితిన్ పెళ్ళిపై కీలక వ్యాఖ్యలు చేసిన సుధాకర్ రెడ్డి

By అంజి  Published on  16 March 2020 10:38 AM GMT
నితిన్ పెళ్ళిపై కీలక వ్యాఖ్యలు చేసిన సుధాకర్ రెడ్డి

హీరో నితిన్ పెళ్లి ఏప్రిల్ 16న ఫిక్స్ చేసుకున్నాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా దుబాయ్ లో చేసుకోవాలని నితిన్ అనుకున్నాడు. షాలిని కందుకూరితో గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న నితిన్ వచ్చే నెలలో ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువుల సమక్షంలో మూడు ముళ్ళు వేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఓ పెద్ద ఫంక్షన్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. నితిన్ పెళ్లిపై కూడా కరోనా ప్రభావం పడిందని తెలుస్తోంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: ‘కరోనా’పై రష్మీ ట్వీట్లు.. దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన నెటిజన్లు

తాము పెళ్లి తంతును దుబాయ్ లో కాకుండా వేరే చోటుకు మార్చాలని అనుకుంటున్నామని అన్నారు. ఇంకా ఏది కూడా ఫైనల్ కాలేదని ఆయన అన్నారు. తమ ముందు ఉన్న ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నామని తెలిపారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే పెళ్ళికి హాజరయ్యే వారి సమాచారాన్ని ముందే ఇవ్వాలి.. వారికి సంబంధించిన సమాచారాన్ని.. విమానాల టికెట్స్ ను.. హోటల్ బుకింగ్స్ ముందే జరిగిపోతుంటాయి. ఇప్పుడు నితిన్ పెళ్లి దుబాయ్ లో రద్దయితే అందరి ట్రావెల్ ప్లాన్స్ దాదాపు క్యాన్సిల్ అయినట్లే.

Also Read: కరోనాను “షూట్” చేస్తున్న సినీ పరిశ్రమ

నితిన్ సోదరి నిఖిత మాట్లాడుతూ ఇంకా చివరి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాము నితిన్ పెళ్లిని పోస్ట్ పోన్ చేయడం.. పెళ్లి రోజును, పెళ్లి జరగబోయే ప్రదేశం విషయంలో మార్పులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కొద్ది రోజులు ఎదురుచూసి.. రాబోయే రోజుల్లో వచ్చే మార్పులను బట్టి తమ నిర్ణయాన్ని తెలుపుతామన్నారు నిఖిత.

Next Story
Share it