సీఎం కేసీఆర్‌ను కలిసిన సినీ హీరో నితిన్
By అంజి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు అవుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తెలుగు సినీ హీరో నితిన్ తన వంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు.. నేనున్నానంటూ నితిన్ ముందుకొచ్చిన సందర్భాలెన్నో.. ఇప్పుడు అదే పంథాను కొనసాగించాడు.
కరోనా కట్టడి కోసం తెలుగు రాష్ట్రాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని నితిన్ అభినందించారు. ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ హీరో నితిన్ కలిశారు. తాను ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కేసీఆర్ కూడా సామాజిక దూరాన్ని పక్కన పెట్టి.. నితిన్‌ను కౌగిలించుకున్నారు. కరోనా కట్టడి కోసం సినీ హీరో నితిన్ తన వంతు సాయం ప్రకటించండంపై సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ హీరో నితిన్‌ను అందరూ పొగుడుతున్నారు.