‘క‌ళ్యాణం వ‌చ్చినా క‌క్కు వ‌చ్చినా ఆగ‌దు’ అనే సామెత ప్రస్తుతం తెలుగు హీరోలకి బాగా సూట్ అవుతుంది. ముప్పై దాటి ఇంకా పెళ్లి చేసుకొని హీరోల లిస్ట్ పెద్దదే ఉంది టాలీవుడ్ లో. అయితే ఈ ఏడాది మాత్రం హీరోలు వరుసగా పెళ్లి పీటలెక్కనున్నారు.  ఇప్పటికే నితిన్ పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసుకోగా  తాజాగా మరో హీరో కూడా ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నాడు. 
Hero Nikhil Gets Engaged To Pallavi Varma
 
ఇటీవలే  ‘అర్జున్ సురవరం’ సినిమాతో  బాక్సాఫీస్ వద్ద సూపర్  హిట్ అందుకున్న హీరో నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు.  భీమవరం అమ్మాయిని గోవాలో ప్రపొజ్ చేసి ఆమెను మెప్పించి వారి పెద్దల్ని కూడా ఒప్పించి మరి పెళ్లి ఖాయం చేసుకున్నాడు. పైగా ఎక్కడైతే ప్రపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే డాక్టర్ పల్లవి వర్మని మొదటిసారి చూసినప్పుడే నిఖిల్ ప్రేమించాడట. మొత్తానికి ప్రేమించిన అమ్మాయినే అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో నిన్న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు.Hero Nikhil Gets Engaged To Pallavi Varma
 
 
కాగా ఏప్రిల్ 16 న నిఖిల్ పల్లవి వర్మను వివాహం చేసుకోబోతున్నాడు. ‘అర్జున్ సురవరం’  మంచి వసూళ్లను రాబట్టి.. నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది.  బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలో పెళ్లి కొడుకు కావటం శుభసూచకం.  ఇక నిఖిల్ మరో  క్రేజ్ సినిమాతో కూడా రాబోతున్నాడు.  నిఖిల్ హీరోగా  సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో  ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్  దర్శకుడిగా ఓ సినిమా రాబో

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.