నాగార్జున నెక్ట్స్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్

By Newsmeter.Network  Published on  14 Dec 2019 10:21 AM GMT
నాగార్జున నెక్ట్స్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన మ‌న్మ‌థుడు 2 సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో త‌దుప‌రి చిత్రాల క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. బిగ్ బాస్ 3 కంప్లీట్ అయిన త‌ర్వాత త‌దుప‌రి చిత్రాన్ని ఎనౌన్స్ చేస్తాన‌ని చెప్పిన నాగ్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే... నాగ్ చేయ‌నున్న నెక్ట్స్ మూవీ గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్ ఏంటంటే... ఊపిరి, మ‌హ‌ర్షి చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసిన సోల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున సినిమా చేయ‌నున్నారు.

ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఈ నెల 16 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఫ‌స్ట్ డే షూటింగ్ లో నాగార్జున పాల్గొంటారు. చార్మినార్ లో షూటింగ్ చేయ‌నున్న ఫ‌స్ట్ షెడ్యూల్ మూడు రోజులు ఉంటుంది. యాక్ష‌న్ మూవీగా రూపొందే ఈ సినిమా క‌థ చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ట‌.

ఈ సినిమా త‌ర్వాత బంగార్రాజు సినిమాని చేయ‌నున్నారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే బంగార్రాజు సినిమాని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో ఈ సినిమా గురించి అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ మెంట్ రానుంది.

Next Story
Share it