మహానటుడిగా  విశ్వవిఖ్యాత నట సార్వభౌమడిగా  తెలుగు తెరను ఏలిన ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా వచ్చిన  ‘ఎన్టీఆర్  బయోపిక్ పార్ట్స్’ లో బాలయ్య బాబు  ఎన్టీఆర్ లా కనిపించి చాలావరకు ఎన్టీఆర్ ను గుర్తు చేస్తూ బాగానే ఆకట్టుకున్నారు. అయితే క్రిష్ దర్శకత్వంలో  వచ్చిన ఆ బయోపిక్  బాక్సాఫీస్ ఫలితం  బాలయ్యకు పెద్ద అవమానాన్నే మిగిల్చింది. కలెక్షన్స్ ను రాబట్టలేక బాలయ్య పూర్తిగా తేలిపోయాడు. దాంతో బాలయ్య  చాల ఫీల్ అయ్యారు. కాగా ప్రస్తుతం  బాలయ్య మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో నటించాల్సిన పరిస్థితి  వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి  జయలలిత జీవిత కథ  ఆధారంగా,   తమిళ డైరెక్టర్  ఏ.ఎల్ విజయ్ ‘తలైవి’ పేరుతో  అమ్మ బయోపిక్ ను భారీ స్థాయిలో  తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్న  ఈ బయోపిక్ లో  జయలలిత పాత్రలో  స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది.  ఐతే ఈ చిత్రంలో  ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంది.  
 
ఇప్పుడు ఎన్టీఆర్ గారి పాత్రకు  బాలకృష్ణనే ఒప్పించాలని నిర్మాతలు భావిస్తున్నారట.  ఎందుకంటే, ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మించిన   నిర్మాతల్లో  విష్ణు ఇందూరి కూడా ఒకరు. కాగా ఆయనే స్వయంగా  నిర్మిస్తోన్న ఈ చిత్రంలో  ఎన్టీఆర్ రోల్ ఉండటం, ఆ రోల్ లో  బాలకృష్ణ  అయితేనే  ఆ పాత్రకు  విలువైన నిండుతనం వచ్చేలా ఉండటంతో..  విష్ణు ఇందూరి తప్పనిసరిగా  బాలయ్యను నటించమని  కోరవచ్చు.  మరి బాలయ్య  మళ్లీ  ఎన్టీఆర్ లా  కనిపించడానికి దైర్యం చేస్తాడా.. వాస్తవానికి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ  పరకాయ ప్రవేశం చేశారు.  ప్రత్యేకించి ఎన్టీఆర్ లోని  ప్రధానమైన కొన్ని  హావభావాలను, బాలకృష్ణ  తన  ముఖ కవళికల్లో చక్కగా  పలికించారు.  కానీ ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడంతో బాలకృష్ణ  జీర్ణించుకోలేకపోయారు. ఖచ్చితంగా ఆ ప్రభావం బాలయ్య  పై ఇప్పటికీ ఉంది.  మరి ఈ పరిస్థితుల్లో బాలయ్య  మళ్ళీ  ఎన్టీఆర్ లా నటించడానికి ఒప్పుకుంటారా..? ఆ ధైర్యం బాలయ్యకు ఉందా..?  చూడాలి.     

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.