చైతు - సాయి పల్లవి 'లవ్ స్టోరీ' ఫిదా చేస్తుందా ?

By Newsmeter.Network  Published on  20 Dec 2019 11:11 AM GMT
చైతు - సాయి పల్లవి లవ్ స్టోరీ ఫిదా చేస్తుందా ?

బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. దానికి తోడు మజిలీ, వెంకీ మామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్యను హీరోగా.. ఫిదా మూవీతో ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవిను హీరోయిన్ గా పెట్టి క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా చేస్తున్నాడు. కాగా రీసెంట్ గా ఈ సినిమా నాలుగో షెడ్యూల్ మొదలు అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం నాలుగో షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది. మొత్తానికి షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేస్తున్నారట.

ముఖ్యంగా చై అండ్ సాయి పల్లవి టైం వెస్ట్ చెయ్యకుండా చాల స్పీడ్ గా షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక తరువాత షెడ్యూల్ కోసం కూడా చిత్రయూనిట్ రెడీ అవుతుంది.కాగా డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటివరకూ వందకు పైగా చిత్రాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో మొదటిసారి నిర్మాణ రంగంలోకి దిగుతోంది.

నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ సినిమాకి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ఈ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా సినిమాకు పెద్ద ఎస్సెట్ అయింది. ఇప్పటికే చాల భాగం షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

Next Story