'అల వైకుంఠపురములో'.. ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ !

By సుభాష్  Published on  19 Dec 2019 1:47 PM GMT
అల వైకుంఠపురములో.. ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ !

డైరెక్టర్ త్రివిక్రమ్ అంటేనే ఆల్ ఎమోషన్స్ కి కేరాఫ్ అడ్రస్. ఇక ఆయన అల్లు అర్జున్ తో చేస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్ ప్లాట్ గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. మొత్తం సినిమాలో ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్ వరకూ ఉంటాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్.. అలాగే క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సినిమాకే హైలైట్ అట. ఇక ఈ సినిమాలో ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందని... ఆ ప్లాష్ బ్యాక్ లో బన్నీ డబుల్ రోల్స్ లో కనిపిస్తాడని, అయితే కేవలం ఐదు నిముషాలు మాత్రమే బన్నీ సెకెండ్ రోల్ కి స్క్రీన్ ప్రేజన్సీ ఉంటుందని తెలుస్తోంది. ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా.. ఈ సినిమాకి పని చేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఇది నిజమేనని చెబుతున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది.

మొత్తానికి బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. అందుకే ఈ సినిమాకి ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన ఆడిపాడింది. అలాగే ఈ చిత్రంలో సుశాంత్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story