మంచు మ‌నోజ్ కొత్త జ‌ర్నీ మొద‌లైంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 1:30 PM IST
మంచు మ‌నోజ్ కొత్త జ‌ర్నీ మొద‌లైంది

మంచు మ‌నోజ్.. ఇటీవ‌ల కాలంలో న‌టించిన ఏ సినిమా స‌క్స‌స్ కాక‌పోవ‌డంతో.. కెరీర్‌లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. ఇక ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో విడాకులు తీసుకున్నాను అని ఎనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే... ఇక నుంచి మనోజ్‌ సినిమాల పై దృష్టి పెట్టాల‌నుకుంటున్నాడ‌ట‌. దీపావ‌ళి సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా త‌న ఫ్యూచ‌ర్ ఫ్లాన్ ఏంటి అనేది తెలియ‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా అల‌రించిన మ‌నోజ్ ఇప్పుడు నిర్మాత‌గా మారి సినిమాలు నిర్మించాల‌నుకుంటున్నాడు.



ఈ విష‌యాన్ని తెలియ‌చేస్తూ... మంచి సినిమాలను అందించ‌డానికి మనోజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండ‌స్ట్రీలో కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశ్యంతో ఎమ్ఎమ్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను నిర్మించిన‌ట్లు తెలియ‌జేశారు. నా కొత్త జర్నీ మొదలైంది. నా సొంత నిర్మాణ సంస్థ ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్ నిర్మాణంలోనే నా తదుపరి చిత్రాలు వస్తాయి. అదే విధంగా కొత్త టాలెంట్‌ కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను అని మనోజ్‌ చెప్పారు.

భవిష్యత్‌లో మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే మంచి చిత్రాలను మీరు చూస్తారు. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ తరుపున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. లవ్‌ యూ ఆల్‌ అని మంచు మనోజ్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. మ‌రి... హీరోగా మ‌నోజ్ ఆశించిన స్ధాయిలో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన.. నిర్మాత‌గా రాణించాలని ఆశిద్దాం.

Next Story