తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తో గోపీచంద్ !

By Newsmeter.Network  Published on  13 Dec 2019 1:22 PM GMT
తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తో  గోపీచంద్ !

కొంతమంది హీరోలకు అసలు కాలం కలిసి రాదు. ఒక హిట్ వచ్చిందంటే.. ఆ తరువాత వెంటనే వరుసగా నాలుగు ప్లాప్ లు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు హీరో గోపీచంద్. యాక్షన్ హీరోగా కొనసాగడానికి నానాతిప్పలు పడుతన్న గోపీచంద్, సినీ కెరీర్ లో గత కొన్నేళ్ళుగా తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడతా ఉన్నాడు. ఎన్నో ఆశలతో చేసిన 'చాణక్య' కూడా బాగా నిరాశపరచడంతో.. గోపీచంద్ పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. దాంతో నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో సినిమా చేయడానికి కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఫలించాయి. డైరెక్టర్ తేజతో చేసిన 'జయం, నిజం' సినిమాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.

ఇటు డైరెక్టర్ తేజ సైతం గోపీచంద్‌ తో కలిసి పని చేయడానికి బాగానే ఇంట్రస్ట్ గా ఉన్నాడు. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ పై చర్చలు జరిగాయని ఫిల్మ్ నగర్ టాక్. గోపీచంద్ కి డైరెక్టర్ తేజ మాస్ జోనర్ లో ఓ లైన్ ను చెప్పారని.. పూర్తిగా పాత్ర బలంతో నడిచే ఆ కథ గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరానికి వీరి సినిమా పట్టాలైక్కే అవకాశముంది. ఇకపోతే గోపిచంద్ ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్ లో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయకిగా నటించనుంది.

Next Story
Share it