విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులు, ముఖ్యంగా అమ్మాయిల మనసులను దోచుకున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో..సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రం ”వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌”. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా సినిమా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ప్ర‌ణాళిక ప్ర‌కారం చిత్ర యూనిట్ భారీ ప్ర‌మోష‌న్స్‌ను ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇందులో న‌టిస్తోన్న న‌లుగురు హీరోయిన్స్‌లో ఒక్కొక్క‌రి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇందులో హీరోతో ఆ న‌లుగురు హీరోయిన్స్‌కు ఉన్న సంబంధాన్ని తెలియ‌జేస్తారు.

వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర పేరు శీన‌య్య‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ భార్య సువ‌ర్ణ‌ పాత్ర‌లో ”కౌసల్య కృష్ణమూర్తి” ఫేమ్ ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ కిచెన్‌లో ఉన్ రొమాంటిక్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ యంగ్ లుక్‌లో క‌న‌ప‌డుతుంటే ఐశ్వ‌ర్య రాజేష్ హోమ్లీ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. అలాగే ఈ నెల 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ థెరిసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 3న విడుద‌ల చేయనుంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ పొందిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీతాన్ని సమకూర్చగా..జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

 

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.