కియారా అద్వానీ కోసం బాగా ట్రై చేస్తున్నాడట..!

By అంజి  Published on  13 Dec 2019 2:54 AM GMT
కియారా అద్వానీ కోసం బాగా ట్రై చేస్తున్నాడట..!

వరుస ప్లాప్ లకు బ్రేక్ వేసి.. పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం పూరి తన తరువాత చిత్రాన్ని క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే పూరి ఈ సినిమా విషయంలో.. మొదటిసారిగా పాన్ ఇండియా లెవల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. తానూ రాసిన స్టోరీ పాయింట్ యూనివర్సల్ పాయింట్ అని, అన్నిభాషలకు వర్కౌట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ ని పూరి రెడీ చేశాడట. అలాగే అన్ని వర్గాల ప్రేక్షుకులకు కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యేవిధంగా బలమైన హ్యూమన్ ఎమోషన్ని స్క్రిప్ట్ లో బాగా ఎలివేట్ చేస్తున్నాడట.

For Kiara Advani

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలని పూరి బాగా ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ లో బజ్ రావాలంటే కియారా అయితేనే బెస్ట్ అని ఈ డాషింగ్ డైరెక్టర్ ఫీల్ అవుతున్నాడట, మరి కియారా అద్వానీ ఒప్పుకుంటుందా..? టాప్ స్టార్ హీరోల సరసన వరుస ఛాన్స్ లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈ టాల్ గ్లామర్ డాల్ విజయ్ దేవరకొండ లాంటి చిన్న హీరో సరసన హీరోయిన్ గా అంటే ఒప్పుకుంటుందో లేదో. అయితే ఇటివలే వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ లో కలిసి నటించారు. ఆ పరిచయంతో విజయ్ దేవరకొండ ఈ బాలీవుడ్ బ్యూటీని ఒప్పిస్తాడేమో. ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నారు. అన్నట్లు ఛార్మి- పూరిల బంధం రోజురోజుకి పెరుగుతూనే ఉంది.

Next Story