యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల సాహో సినిమాతో ప్రేక్ష‌కుల  ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా బాలీవుడ్ లో స‌క్స‌స్ సాధించినా టాలీవుడ్ లో మాత్రం స‌క్స‌స్ సాధించ‌లేక‌పోయింది. దీనికి కార‌ణం సరైన క‌థ‌ను ఎంచుకోక‌పోవ‌డ‌మే అని తెలుసుకున్నాడు. దీంతో ఆలోచ‌న‌లో ప‌డిన ప్ర‌భాస్ ఈసారి అలా కాకుండా.. అంద‌రికీ న‌చ్చే క‌థ‌తో సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాడు.

ప్ర‌స్తుతం జిల్ మూవీ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ తో సినిమా చేస్తున్నాడు. అయితే… క‌థ పై మ‌ళ్లీ క‌స‌ర‌త్తు చేయ‌మ‌ని చెప్పాడ‌ట ప్ర‌భాస్. ఈ నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ… రాధాకృష్ణ కుమార్ క‌థ‌లో చేసిన మార్పులు చేర్పులు ప్ర‌భాస్ కి అంత‌గా న‌చ్చ‌లేద‌ట‌. అందుచేత మ‌రోసారి స్క్రిప్ట్ పై వ‌ర్క్ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌.

ఇప్ప‌ట్లో షూటింగ్ ఉండే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ప్ర‌భాస్ మ‌ళ్లీ విదేశాల‌కు వెళుతున్నాడ‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే… రాధాకృష్ణ ఎప్ప‌టికీ ప్ర‌భాస్ మెచ్చేలా స్క్రిప్ట్ రెడీ చేస్తాడు..? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాడు..? ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడు తీసుకెళ‌తాడు..? మ‌రి.. ఫిల్మ్ న‌గ‌ర్ లో ఈ సినిమా పై వ‌స్తున్న వార్త‌ల పై ప్ర‌భాస్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.