పోల్ డ్యాన్సింగ్ చేసే ఏకైక హీరో ఆయనే

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అంటేనే ఫిట్నెస్ కు కేరాఫ్ అడ్రెస్. ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఎనర్జీతో స్టంట్స్ చేస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే.. ఆయన చేసే వర్కౌట్లు, ఆడే గేమ్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాడు. హాలిడే వచ్చిందంటే సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పనిసరి అని అంటాడు అక్షయ్. ఏదో ఒక్క వ్యాయామానికి కట్టుబడి ఉండలేడు అక్షయ్. కిక్ బాక్సింగ్, యోగా, మార్షల్ ఆర్ట్స్ ఇలా చాలా వాటినే నేర్చుకున్నాడు. తాజాగా అక్షయ్ తన వర్కౌట్ రొటీన్ లోకి పోల్ డ్యాన్సింగ్ ను కూడా చేర్చాడు.

సాధారణంగా పోల్ డ్యాన్సింగ్ ను ఎక్కువగా అమ్మాయిలు నేర్చుకుంటుంటారనే అపోహ ఉంది.. శరీరంలో ఉన్న అధిక క్యాలరీలను పోల్ డ్యాన్సింగ్ ద్వారా కరిగించేయొచ్చు. ఇది తెలుసుకున్న అక్షయ్ పోల్ డ్యాన్సింగ్ ను నేర్చుకుంటున్నాడు. ఈ మధ్యనే క్లాసులు మొదలయ్యాయని.. తాను చాలా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు అక్షయ్. దేనికైనా నైపుణ్యం అనేది చాలా ముఖ్యమని.. పోల్ డ్యాన్సింగ్ మాత్రం చాలా కష్టంతో కూడుకున్నదని అక్షయ్ అన్నాడు. 2011లో విడుదలైన ‘దేశీ బాయ్స్’ సినిమాలోని ‘సుబహ్ హోనే నా దే’ అనే సాంగ్ లో పోల్ డాన్స్ చేస్తూ కనిపిస్తాడు అక్షయ్. దాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఏదైనా సినిమా కోసం పోల్ డ్యాన్సింగ్ అన్నది నేర్చుకోవడం లేదని.. ఇంతకు ముందు తాను నేర్చుకోని ఓ వర్కౌట్ ను నేర్చుకోవాలనే తపనతో ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘సూర్యవంశీ’ విడుదలకు సిద్ధమవుతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించి అక్షయ్ కుమార్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. తన సినిమాల్లో స్టంట్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. 30 ఏళ్ల కెరీర్ లో తాను ఎన్నో స్టంట్స్ చేయగలిగానని మహా అయితే ఇంకో నాలుగు ఐదేళ్లు తాను చేయగలనని అన్నాడు. ఆ తర్వాత కూడా వయసు సహకరిస్తే తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. సినిమాల్లో స్టంట్స్ చేయడమంటే డిస్నీ ల్యాండ్ కు వెళ్ళినట్లేనని.. రియల్ గా చేసే యాక్షన్ ను తాను నిజంగా ప్రేమిస్తానని అన్నాడు. వీఎఫ్ఎక్స్ లో హీరోతో స్టంట్స్ చేయించడం తనకు నచ్చదని అన్నాడు. సూర్యవంశీ సినిమాలో ఏటీఎస్(యాంటీ టెర్రర్ స్క్వాడ్) ఆఫీసర్ పాత్ర కోసం ఎనిమిది నుండి తొమ్మిది కిలోల బరువు తగ్గాడు అక్షయ్.

సుగంధీ సినిమా ద్వారా..

ఈ సినిమా క్లైమాక్స్ లో ముగ్గురు స్టార్ హీరోలు కనిపించడం పెద్ద హైలైట్ గా నిలవనుంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్ లు ఈ సినిమాలో తళుక్కుమనబోతున్నారు. చిన్న రోల్స్ అయినా చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.

Hero Akshay kumar Pole dance

1990లో సుగంధీ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టానని.. ఇది తన 30వ సంవత్సరం అని అసలు నమ్మశక్యం కావడం లేదని అన్నాడు. తన తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి కూడా అక్షయ్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు. బచ్చన్ పాండే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. హిమాంషు శర్మ రైటర్ గా వ్యవహరిస్తున్న ‘అత్రంగి రే’ షూటింగ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నానన్నాడు. లక్ష్మీ బాంబ్(కాంచన) సినిమా కూడా 2020 ఈద్(రంజాన్) సందర్భంగా విడుదల కాబోతోందని అక్షయ్ కుమార్ అన్నాడు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.