స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అల‌.. వైకుంఠ‌పుములో’. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. టబు పుట్టిన రోజు సందర్భంగగా ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్‌ సోమవారం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ‘ఆమె చూపులు మన హృదయాలను కొల్లగొడతాయి. ఆమె టాలెంట్‌తో ఎవరినైనా ఆకట్టుకోగలదు. టబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీతో మరిన్ని చిత్రాలు చేయాలని మేము ఎదురుచూస్తున్నామంటూ’ చిత్రబృందం పేర్కొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.