హేమంత్‌ హత్య కేసు: నిందితుల విచారణలో కీలక విషయాలు..!

By సుభాష్  Published on  2 Oct 2020 8:44 AM GMT
హేమంత్‌ హత్య కేసు: నిందితుల విచారణలో కీలక విషయాలు..!

హేమంత్‌ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడి మూడో రోజుకు చేరింది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డిలు పలు కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ప్రాణం కంటే పరువే ముఖ్యమని, అందుకే హేమంత్‌ను హతమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకున్నారు.

హేమంత్‌ హత్యకు మొదట వేరే సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యుగంధర్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదిరాక సుపారీ గ్యాంగ్‌ స్పందించకపోవడంతో హేమంత్‌ హత్య వాయిదా పడిందని, దీంతో తనకు పరిచయం ఉన్న బిచ్చు యాదవ్‌తో మరో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యుగంధర్‌రెడ్డి విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈసారి పక్కాగా ప్లాన్‌ అమలు చేశామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు సీన్‌ రీకన్‌ స్ట్రక్షన్ కోసం నిందితులను మరోసారి తీసుకెళ్లారు.

Next Story