చిత్తూరు: పోలీసులకు చిక్కిన గుప్త నిధుల తవ్వకాల ముఠా

By సుభాష్  Published on  1 Oct 2020 10:22 AM GMT
చిత్తూరు: పోలీసులకు చిక్కిన గుప్త నిధుల తవ్వకాల ముఠా

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల ముఠా పోలీసులకు పట్టుబడింది. దీనికి సంబంధించి 8 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మూడు రోజుల కిందట గంగాధర నెల్లూరు మండలం అగరమంగళంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో వీరు గుప్త నిధుల తవ్వకాలు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు.గుడిలోని నంది విగ్రహాన్ని పెకలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని పోలీసులు వెల్లడించారు. ముఠాలో కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరుకు చెందిన సోమశేఖరతోపాటు మరో ఏడుగురిని చేసినట్లు పోలీసులు తెలిపారు.

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, మహానంది, గుంటూరు జిల్లాలోని మాచర్లతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.అయితే పాత రేడియోలు, గ్రామ్‌ ఫోన్‌ రికార్డులను అధిక ధరలకు కొనుగోలు చేస్తామంటూ కూడా ఈ ముఠా జనాలను మోసగిస్తున్నట్లు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు.

Next Story
Share it