మాంద్యంలోనూ ముద్దొస్తున్న ఆ కార్లు...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 10:24 PM IST
మాంద్యంలోనూ ముద్దొస్తున్న ఆ కార్లు...!

మాంద్యం దేశాన్ని కారు మబ్బుల్లా చుట్టుముట్టుతోందంటున్నారు. ఆర్ధికంగా చాలా కష్టాలున్నాయని విపక్షాల నుంచి బిజినెస్ ఎక్స్‌ఫర్ట్స్ దాకా అంటున్నారు. వాహన రంగం కుదేలై పోతుంటే కేంద్రం కూడా కదిలి వస్తుంది. ఆటో మొబైల్‌లో రంగంలో వేల ఉద్యోగాలు పోయే పరిస్థితి కాని..ఆ కార్లకు డిమాండ్ తగ్గలేదు. యూవీ విభాగంలో ఎస్‌యూవీ, కంపాక్ట్యూవీ, మినీయూవీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు.. కార్ల ప్రియులు వాటినే ఇష్టంగాకొంటున్నారు. యూవీ విభాగంలో కార్లు ఒక్కసెప్టెంబర్‌లో దాదాపు 6శాతం వృద్ధిని సాధించాయంటే..వీటిపై మాంద్యం మబ్బులు కమ్ముకోలేదనే చెప్పాలి. గతేడాది సెప్టెంబర్‌లో యూవీ విభాగంలో 77, 380 కార్లు అమ్ముడుపోగా, ఈ సెప్టెంబర్‌లో 81వేల 625 కార్లు అమ్ముడుపోయాయి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు కార్లు డిజైన్ చేస్తే..మాంద్యం కూడా ఏం చేయలేదు అనడానికి యూవీనే నిదర్శనం.

Heavy speed car marketing

మారుతీ సుజుకి కూడా 11 రోజుల్లో 10వేల కార్లు

మారుతీ సుజుకీ మార్కెట్లోకి తెచ్చిన మినీ ఎస్‌యూవీ ఎస్‌ -ప్రెప్సోకు మంచి స్పందన లభిస్తుంది. వినియోగదారులు 11 రోజుల్లోనే 10వేల బుకింగ్స్ చేసుకున్నారు. మెరుగైన, ఆధునిక ఫీచర్లతో రావడంతో వినియోగదారులు, కార్ల ప్రియులు దీనిపై మొగ్గు చూపుతున్నారు. ధర కూడా రూ.3.69 లక్షల నుంచి రూ.4.94లక్షల వరకు ఉంటుంది. ధర కూడా అందుబాటులో ఉండటం..చూడగానే లుక్‌ బాగుండటంతో వినియోగదారులు మరో ఆలోచన లేకుండా దీనిని బుక్ చేసుకుంటున్నారు.

Heavy speed car marketing

ఇప్పటికే క్రెటాతో ఎస్‌యూవీ మార్కెట్లో దూసుకుపోతున్న హూందాయ్‌కి వెన్యూ మరింత బలాన్ని ఇచ్చింది. మే -సెప్టెంబర్‌ దాదాపు 43వేల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక బ్రిటన్‌కు చెందిన హెక్టార్‌ కారును కూడా వినియోదారులు ఇష్టపడుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ కారు ధరను 2.5శాతం పెంచుతున్నట్లుయాజమాన్యం ప్రకటించింది. కేవలం 12 రోజుల్లో 8వేల యూనిట్ల బుకింగ్ సాధించింది.

Heavy speed car marketing

Next Story