తెలంగాణలో భారీ వర్షాలు
By సుభాష్ Published on 20 July 2020 6:33 PM ISTతెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మఠ్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు మధ్య కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరో 24 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తెలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అధిక వర్షాలు కురిసే జిల్లాలను వాతావరణ శాఖ వివరించింది. నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.