సర్జరీ ద్వారా ఎత్తు పెరగాలి అనుకుంటున్నారా.? ఖర్చు ఎంతో తెలుసా..?
The Man Who Paid ₹ 55 Lakh To Increase His Height. ఎత్తు ఉండటం అనేది కొందరికి ఒక కలగానే ఉండిపోద్ది. కానీ సర్జరీ ద్వారా ఎత్తు పెరిగాడు, ఖర్చు ఎంత తెలుసా.
By Medi Samrat Published on 21 Jan 2021 6:54 AM GMTఎత్తు ఉండటం అనేది కొందరికి ఒక కలగానే ఉండిపోద్ది. హీరోల మాదిరిగా ఆరడుగుల ఎత్తుతో ఎంతో అందంగా ఉండాలని చాలా మంది యువకులు ఎంతో కష్టపడుతుంటారు. ఎత్తు పెరగడం కోసం, తమ శరీరం ఫిట్ గా ఉండడం కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే ఎత్తు పెరగడం అనేది కొందరికి సాధ్యపడినా.. మరికొందరికి అసాధ్యంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఎత్తు పెరగడం కలగా ఉన్న ఓ యువకుడు ఏకంగా సర్జరీ ద్వారా తన ఎత్తును పెంచుకున్నాడు.
అయితే ఆ సర్జరీకి ఆ యువకుడు ఎంత ఖర్చు చేసాడో తెలిస్తే షాక్ అవుతారు. ఎత్తు పెరగడం కోసం సర్జరీ చేయించుకోవడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది సర్జరీ విధానం ఎలా చేస్తారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. అమెరికాకు చెందిన అల్ఫోన్సో ఫ్లోరేస్(28) అనే యువకుడు 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి తను ఆరడుగుల ఎత్తులో ఉండాలనే కలలు కనేవాడు.అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.దీంతో ఆ యువకుడు ఎత్తు పెరగడం కోసం ఏకంగా సర్జరీ చేయించుకోవాలని భావించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేవిన్ దేబీపర్షద్ ను ఫ్లోరేస్ సంప్రదించాడు.
ఈక్రమంలోనే ఆర్థోపెడిక్ సర్జన్ కేవిన్ దేబీపర్షద్ 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్న ఫ్లోరేస్ కు లింబ్ లెంథెనింగ్ సర్జరీ చేశారు. ఈ సర్జరీ ద్వారా ఫ్లోరేస్ ఆరడుగుల ఒక అంగుళం ఎత్తుకు చేరుకున్నాడు. ఈ ఎత్తు పెరగడానికి ఫ్లోరేస్ కి సుమారు ఏడు నెలల సమయం పట్టింది. ఈ విధంగా ఎత్తు పెరగడం కోసం సర్జరీ చేయడానికి సుమారు 55 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. ఈ సర్జరీ ద్వారా కాలిలో ఉన్న ఎముకలకు రంధ్రాలు చేసి వాటిని రెండుగా విభజిస్తారు. తరువాత వాటి మధ్య లోహంతో తయారు చేసిన రాడ్ అమర్చి మనకు కావలసిన పరిమాణానికి చేరుకునే వరకు ప్రతిరోజు దానిని ఒక్కో మిల్లీమీటర్ చొప్పున పెంచుతూ పోతారు. మనిషి ఎత్తు పెరగడం కోసం కాలి ఎముకలను విడదీసి అందులోకి ఒక పరికరం పెట్టడమే కాస్మోటిక్ లింబ్-లెంథినింగ్ సర్జరీని విధానమని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దేబీపర్షద్ తెలిపారు.