కొబ్బరి పువ్వుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? తెలుసుకుంటే మాత్రం వదిలిపెట్టరు
Surprising benefits of the Coconut Embryo.ఒక్కొక్కసారి టెంకాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తుంటుంది.
By తోట వంశీ కుమార్ Published on 10 Jan 2023 9:36 AM GMTగుడికి వెళ్లినప్పుడు కొబ్బరి కాయను కొడుతుంటారు. ఒక్కొక్కసారి టెంకాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తుంటుంది. ఇలా పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని కొందరు విశ్వసిస్తుంటారు. కొందరు ఆ పువ్వు మంచిదని తింటారు, మరికొందరు దాన్ని తీసిపడేస్తారు..? ఇంతకు కొబ్బరి పువ్వును తినొచ్చా..? దాన్ని తినడం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే మరొసారి దాన్ని పారేశారు.
కొబ్బరి కాయలో పువ్వు ఎలా ఏర్పడుతుందంటే..?
కొబ్బరి కాయంలో ఉన్న నీళ్లు ఇంకిపోయి, కొబ్బరి ముదిరినప్పుడు లోపల తెల్లటి పువ్వు ఏర్పడుతుంది. నిజానికి కొబ్బరి నీళ్లు, కొబ్బరి కంటే ఈ పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. రుచి కూడా బాగుంటుంది. దీన్ని ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తినొచ్చు. దీన్ని తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. పై పెచ్చు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
మన రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలోనూ సహాయపడుతుంది. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు తగ్గుతారు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలోనూ కొబ్బరి పువ్వు అద్భుతంగా సాయం చేస్తుంది.
కొబ్బరిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని దరిచేరనీయకుండా సాయం చేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. చర్మసౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ముడతలు, చిన్న మచ్చలు, నల్ల మచ్చలు నివారిస్తుంది.
కాబట్టి కొబ్బరి పువ్వు ఎక్కడైన కనిపిస్తే తప్పకుండా తినేయండి. అయితే.. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యులు సూచిస్తేనే వీటిని తినడం మంచిది.