చాలా మంది కాల్షియం కోసం పాలు, పాల ఉత్పత్తులను తీసుకుంటారు. కానీ, ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలువబడే రాగులు వంటి తృణధాన్యాలు కూడా కాల్షియం యొక్క గొప్ప మూలం. పాల ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడతాయని మీకు తెలుసా.. ముఖ్యంగా లాక్టోస్ అసహనం ఉన్నవారికి.. అంటే పాల రుచి నచ్చని వారు తమ శరీరానికి కావల్సిన క్యాల్షియం అవసరాలను తీర్చే రాగులను తీసుకోవచ్చు. ఈ తృణధాన్యాల ధాన్యంలో 100 గ్రాములకు సుమారు 364 మి.గ్రా కాల్షియం ఉంటుంది.
రాగులు పోషకపరంగా ముఖ్యమైన ఆహార వనరుగా గుర్తించడానికి దోహదం చేస్తుంది. రాగులు ముఖ్యంగా శాఖాహార ఆహారం అని నిపుణులు తెలిపారు. అయితే రాగులు కాల్షియం పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్. ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, మెగ్నీషియం కలిగి ఉంటాయి. ఎముకలకు సంబందించిన సమస్యలు రాకుండా రాగులు ఉపయోగపడ తాయి. 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీ గ్రాముల కాల్షియం, 100 మిల్లీ లీటర్ల ఆవు పాలలో 118 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కాబట్టి పాలకు మంచి ప్రత్యామ్నాయాల్లో రాగులు ఒకటిగా పరిగణిస్తారు.