నొప్పి లేకుండా మధుమేహం పరీక్షలు.. హైదరాబాద్ యువత తీసుకుని రానున్న వినూత్న పరికరం

HYD start up Vivalyf Innovations glucometer hopes to make glucose tests painless.దువ్వూరు వర్షితకు పుట్టుకతోనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 3:52 PM GMT
నొప్పి లేకుండా మధుమేహం పరీక్షలు.. హైదరాబాద్ యువత తీసుకుని రానున్న వినూత్న పరికరం

దువ్వూరు వర్షితకు పుట్టుకతోనే టైప్‌-1 మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె తన జీవితాంతం ఇంట్లో గ్లూకోజ్ పరీక్ష కోసం వేలిని గుచ్చుకుంటూ ఉండాలని(పరీక్ష చేసుకునే విధానం) తేలింది. కొన్ని కొన్ని సార్లు గ్లూకోజ్ పరీక్ష తప్పుగా రావడం.. అలాంటి సమయాల్లో ఆమె కోమాలోకి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల సమయంలో ఇప్పటివరకు ఆమె ఆరుసార్లు కోమాలోకి వెళ్ళింది. అత్యధికంగా 56 రోజులు ఆమె కోమాలో ఉండగా..అతి తక్కువగా రెండు రోజులు కోమాలో ఉన్నానని ఆమె చెప్పింది.

ఆమె ఎన్నో బాధలను అనుభవిస్తూ వచ్చింది. ముఖ్యంగా పరీక్ష చేయడానికి ప్రత్యామ్నాయ, సులభమైన మార్గాన్ని కనుగొనాలని వర్షిత ఎప్పుడో అనుకుంది. ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఆమె డిసెంబర్ 2020లో విమల్ కుమార్‌తో కలిసి కాంటాక్ట్‌లెస్ గ్లూకోమీటర్ ను తయారు చేయాలని అనుకుంది. ఇద్దరూ కలిసి 'Vivalyf ఇన్నోవేషన్స్‌' ని స్థాపించారు. Vivalyf రక్త నమూనాలను తీసుకోవలసిన అవసరం లేని నాన్-ఇన్వాసివ్ గ్లూకోమీటర్‌ను అభివృద్ధి చేసింv ది. వారు తయారు చేసిన ఉత్పత్తి పేరు EzLyf. ఇది నాన్-ఇన్వాసివ్, రక్తాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నొప్పి అసలు ఉండనివ్వదు, మీ గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేసే పరికరం. "ఇది వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్, చాలా యూజర్-ఫ్రెండ్లీ పరికరం. కనెక్ట్ చేయడం, ట్యాప్ చేయడం, పరీక్షించడం మాత్రమే చేయాల్సి ఉంటుంది" అని వర్షిత వివరించింది.

"ఈ పరికరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రికార్డ్ చేయడానికి స్పెక్ట్రోస్కోపిక్ పద్ధతిని ఉపయోగిస్తుంది" అని విమల్ చెప్పుకొచ్చాడు. పరికరంలో వేలిని నొక్కిన తర్వాత, షుగర్ లెవల్స్ 60 సెకన్లలో యాప్‌లో ప్రదర్శించబడతాయి. "బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు, HbA1c స్థాయిలు, ఇతర వివరాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయి" అని వర్షిత తెలిపింది. ఉత్పత్తి ఇంకా ప్రారంభించబడనప్పటికీ ఇది ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్‌లలోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పరికరం ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. "నేను పరికరాన్ని ఉపయోగిస్తున్నాను. ఇది చాలా సౌకర్యవంతంగా ఉందని నేను కనుగొన్నాను" అని వర్షిత తెలిపింది.


"చాలా మంది వ్యక్తులు ఒకే గ్లూకోమీటర్‌ని ఉపయోగించవచ్చు. ఏ పరికరాన్ని వీలైనంత తక్కువ ధరకు మార్కెట్ లోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రజలు షుగర్ పరీక్షలకు డబ్బులు చాలా ఖర్చు చేస్తుంటారని నేను తెలుసుకున్నాను" అని వర్షిత వివరించింది. EzLyf పరికరాన్ని రూ.3,000- 4,000 మధ్య ధర నిర్ణయించాలని ప్లాన్ చేస్తున్నారు.

విమల్, వర్షిత డెకాథ్లాన్‌లో కలుసుకున్నారు. "అక్కడ షుగర్ టెస్ట్‌లకి వర్షిత ఎంత బాధపడిందో చూశాను. నొప్పిలేకుండా ఏదన్నా సృష్టించాలనేది ఆమె ఆలోచన. మా నాన్నకు కూడా డయాబెటిక్ ఉంది కాబట్టి ఆ బాధను అర్థం చేసుకోగలను" అన్నాడు విమల్. ఇద్దరూ డిసెంబర్ 2020లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో పొదిగిన హెల్త్‌కేర్ స్టార్టప్ అయిన Vivalyf ఇన్నోవేషన్స్‌ని ప్రారంభించారు.

2021లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వల్ల 6.7 మిలియన్ల మంది మరణించారని, ఐదుగురు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో నలుగురు తక్కువ ఆదాయ దేశాలలో నివసిస్తున్నారని వర్షిత తెలిపింది. బ్లడ్ షుగర్ లెవల్స్ తెలుసుకునే పద్ధతులు ఖరీదైనవని, అలాగే అసౌకర్యంగా ఉంటాయని ఆమె చెప్పింది. EzLyf హెల్త్ కేర్ మార్కెట్‌లో నొప్పిలేకుండా ప్లగ్-అండ్-ప్లే గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్‌గా మంచి ఆదరణ సంపాదిస్తుందని వారు చెబుతున్నారు.

షార్క్ ట్యాంక్ లో ఆదరణ:

Ezlyf షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ వన్‌ లో తమ ఐడియాను వెల్లడించారు. అనుపమ్ మిట్టల్, పీయూష్ బన్సాల్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. "షార్క్ ట్యాంక్ తర్వాత, జీవితం అద్భుతంగా ఉంది. అనుపమ్, పీయూష్ నుండి మేము చాలా నేర్చుకున్నాము" అని వర్షిత తెలిపింది. ఎపిసోడ్ ప్రసారం అయిన తర్వాత, దేశవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు మధుమేహం వల్ల కలిగే అనేక బాధలను పంచుకోవడానికి తనకు ఫోన్ చేశారని కూడా ఆమె చెప్పింది. షార్క్ ట్యాంక్ ఇండియాలో డీల్ స్కోర్ చేయడంతో పాటు, Vivalyf ఇన్నోవేషన్స్ ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (TiE) ఉమెన్ గ్లోబల్ పిచ్ కాంపిటీషన్, హైదరాబాద్ చాప్టర్ విజేతగా నిలిచింది. 2021 ఉత్తమ స్టార్టప్ పిచ్ కోసం కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది.

Next Story