ఓ వైపు సహాయం.. మరో వైపు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే డాక్టర్. విజయ్ కుమార్ చెన్నంశెట్టి లక్ష్యం
Hyd pulmonologist Dr Vijay Kumar Chennamchetty believes patients must be treated with empathy
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2022 10:56 AM GMTవైద్య వృత్తిలో ఉన్న వారు ఎంతో వినయంగా, సహాయకారిగా ఉండడమే కాకుండా.. మంచి పని తీరు కనబరచాలని నిరూపిస్తున్నారు డాక్టర్.విజయ్ కుమార్ చెన్నంశెట్టి. ఆయన రోగులతో సొంత మనిషిలా మాట్లాడుతూ ఉంటారు.. వారి సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చడంలో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ పల్మోనాలజిస్ట్ అయిన డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి సానుభూతి కూడా వైద్య వృత్తిలో ఒక ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు. ఇతరుల గురించి ఆలోచించే మనసు.. మనిషి ఆయన అని ఎంతో మంచి చెబుతుంటారు రోగులకు మానవతా విలువలపై చికిత్స అందించాలి, ఈ లక్షణాన్ని గుర్తుంచుకోవాలి.. ఎప్పటికప్పుడు అమలు చేయాలి. మెరుగైన ఫలితాల కోసం ప్రతి స్థాయిలో రోగుల దృక్కోణం నుండి చూడటం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
చెన్నైలోని సుందరం మెడికల్ ఫౌండేషన్‌లో క్రిటికల్ కేర్ విషయంలో శిక్షణ పొందుతున్నప్పుడు ఈ ఆలోచన అతనిలో నాటుకుపోయింది. రోగిలో మిమ్మల్ని లేదా మీ కుటుంబ సభ్యులను చూసి వారికి చికిత్స చేయాలన్నది నేర్చుకున్నారు. తప్పుడు చికిత్స కారణంగా తన తల్లికి ఎదురైన బాధను చూసి డాక్టర్ కావాలనే నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి చెందిన విజయ్ కుమార్ కుటుంబం ఒకప్పుడు తల్లికి వైద్యం చేయించడం కోసం ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే వైద్యుడవ్వాలని విజయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "నేను సివిల్ సర్వీసెస్ చేయాలని ఆశించాను, కానీ ఆ ఒక్క సంఘటన నన్ను డాక్టర్‌ని అయ్యేలా చేసింది. నేను మంచి డాక్టర్ ను మాత్రమే కాకుండా రోగులపై సానుభూతి ప్రేమ.. చూపించగలిగే డాక్టర్‌ని కావాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం కోసం మాత్రమే పనిచేశాను." అని అన్నారు.
ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో గోల్డ్ మెడల్స్ మిస్సయ్యాయి:
కష్టపడి పనిచేస్తూ వచ్చారు విజయ్ కుమార్. చదువులో బ్యాచ్‌లో అగ్రస్థానంలో ఉండాలని ఆశించాడు. కానీ ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో గోల్డ్ మెడల్ కోల్పోయారు. ఆయన 2004లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి MBBS, 2008లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి పల్మనరీ మెడిసిన్ పూర్తి చేశారు.
"నేను ఎప్పుడూ అగ్రస్థానం కోసం పోటీ పడుతూ వస్తుంటాను. కానీ నేను ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో కోల్పోయాను. వైజాగ్‌లోని AMC లో చదువుకున్నప్పుడు నా వైద్య విద్యలో గోల్డెన్ టైమ్ అని భావిస్తాను. నేను ఎల్లప్పుడూ బెడ్‌సైడ్ ప్రాక్టీస్‌లో, కొత్త విధానాలను నేర్చుకుంటూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటాను. పల్మోనాలజీలో అభ్యసిస్తున్న అత్యాధునిక మెళకువలను నాకు నేర్పించమని నా ప్రొఫెసర్లను అడుగుతుండేవాన్ని. నా జీవితంలో అత్యుత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన నా ప్రొఫెసర్లు డాక్టర్ జి. రవీంద్రబాబు, డాక్టర్ ఉషారాణి, డా. సునీల్ కుమార్, డా. ప్రేమ్ కుమార్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు విజయ్ కుమార్.
క్రిటికల్ కేర్‌లో శిక్షణ:
మంచి వైద్యుడిగా ఉండాలంటే, అత్యవసర పరిస్థితులలో ఎలా పని చేస్తాం.. రోగులతో వ్యవహరించే తీరు చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. పల్మోనాలజీ విభాగంలో తన పని పూర్తి చేసిన తర్వాత ఎమర్జెన్సీ కేర్ లో విధులను నిర్వహిస్తున్నాడు. అతను 2010లో సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ నుండి క్రిటికల్ కేర్‌లో డిప్లొమా పొందాడు. చెన్నై, సింగపూర్‌లలో శిక్షణ సమయంలో మినిమమ్ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ, లోబెక్టమీ, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, స్లీప్ డిజార్డర్ ట్రీట్‌మెంట్లలో నైపుణ్యం సాధించడమే కాకుండా.. కొత్త పద్ధతులను నేర్చుకోవడంలో సహాయపడింది.
మహమ్మారి చికిత్స, బోధనకు దారితీసింది
కోవిడ్ -19 వ్యాప్తి చెందడంతో, కొత్త పరిశోధనా పత్రాలను చదవడం, గైడ్ లైన్స్ మార్చడం, అమలు చేయడం తప్పనిసరి కావడంతో విజయ్ కుమార్ కూడా అప్రమత్తమయ్యారు. అర్థరాత్రి వరకు మేల్కొని ప్రపంచవ్యాప్తంగా తాజా పరిణామాలను చదువుతూ, భారతదేశంలో అది ఎలా విస్తరించగలదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. రోగులు కోలుకోవడం, ఛాతీ వైద్యులు కరోనా రోగులకు ఇచ్చే సూచనల గురించి దేశం మొత్తం మాట్లాడుకున్న సంగతి తెలిసిందే..! "నేను శస్త్రచికిత్స లేకుండా కోవిడ్-19 మొదటి వేవ్‌లో బ్లాక్ ఫంగస్ రోగిని డిశ్చార్జ్ చేసాను. రోగి 100 రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో నా పర్యవేక్షణలో ఉన్నాడు, పూర్తిగా కోలుకున్నాడు. ఇతర సమస్యలు లేవు" అని డాక్టర్ విజయ్ చెప్పారు.
మహమ్మారి ప్రబలుతున్న సమయంలో వైద్యులు కూడా ఎన్నో ఇబ్బందులను, సవాళ్ళను ఎదుర్కొన్నారు. PPE కిట్‌లలో గంటల కొద్దీ పని చేయాల్సి వచ్చింది. దాహం వేస్తే తీర్చుకోవడం కూడా కష్టమైన విషయమే.. శ్వాసను తీసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపించేది. "ఓ రోగి ఒకరోజు కోలుకోవడం.. మరుసటి రోజు కుప్పకూలడం వంటి సందర్భాలను నేను చూశాను. ఇది చాలా కష్టమైన సమయంగా నడిచింది.. అందరూ బాగుండాలని, వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తూనే ఉండేవాన్ని" అని డాక్టర్ కుమార్ చెప్పారు.
కోవిడ్-19 పరిణామాలపై ఎప్పటికప్పుడు ఛాతీ వైద్యులు వివరణ ఇస్తూ ఉండేవారు. ఆ వివరాలను కుమార్ తెలుసుకుంటూ ఉండేవారు. ఛాతీ వైద్యులు తమ అనుభవాలను ఆన్‌లైన్‌లో వివరించడంతో, పల్మోనాలజీలో తాజా పరిశోధనలను సంబంధించి శిక్షణా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు విజయ్ కుమార్. అప్పట్లో కోలుకోవడానికి స్టెరాయిడ్‌ల వాడకం చాలా ఎక్కువగా ఉంది, కానీ అది తీవ్ర ప్రభావాలను కలిగిస్తూ ఉండేవి. వైద్యులకు అవగాహన కల్పించడానికి, అందుబాటులో ఉన్న మందులను తెలివిగా ఉపయోగించేందుకు, లక్షణాల ఆధారంగా ప్రోటోకాల్ రూపొందించారు. "నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 800 మంది వైద్యులకు చెస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా శిక్షణ ఇచ్చాను. కోవిడ్-19పై రోగుల సందేహాలకు సమాధానమివ్వడానికి నేను ప్రతి ఆదివారం ఫేస్‌బుక్, జూమ్ లైవ్ షోలు నిర్వహించాను. దాదాపు ఐదు ఖండాల్లో నా షోలు చూశారు. ఇది చాలా మందికి సహాయపడింది. నాకు కూడా ఎంతో సంతృప్తిని ఇచ్చిన అంశం." అని అన్నారు విజయ్ కుమార్.
ఓ వైపు రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడం.. కోవిడ్ -19 గురించి అపోహలను తొలగించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయనకు అతని తల్లి, భార్య, పిల్లలు సహాయం చేశారు. వీరంతా వీడియోలను రికార్డ్ చేయడంతో పాటూ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్లోడ్ చేయడం, లైవ్ ఇవ్వడం వంటి విషయాల్లో అతనికి సహాయం చేశారు. ఆ సమయంలో సరైన సమాచారం నేరుగా రోగులకు ఇవ్వాలనే నా వంతు ప్రయత్నం చేశాను. అనుకున్నట్లుగా ప్రజలు కూడా నేను ఇచ్చే సమాచారాన్ని వినియోగించుకున్నారు. అదే నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది" అని విజయ్ కుమార్ చెప్పారు.