చిన్నారుల్లో పెరుగుతున్న 'రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌' కేసులు

చిన్నారుల్లో పెరుగుతున్న 'రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌' కేసులు కలవర పెడుతున్నాయి.

By -  అంజి
Published on : 12 Oct 2025 10:50 AM IST

rheumatic heart disease, children, World Heart Federation

చిన్నారుల్లో పెరుగుతున్న 'రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌' కేసులు

చిన్నారుల్లో పెరుగుతున్న 'రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌' కేసులు కలవర పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు కోట్ల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ఏటా మూడు లక్షల మంది ఈ వ్యాధితో చనిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. బాల్యంలో వచ్చే ఈ వ్యాధి వైకల్యానికి దారి తీస్తుందని.. కొననిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈవ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ముదిరితే గుండె వాల్వ్‌ దెబ్బతిని చివరకు ప్రాణాంతకంగా మారుతుంది.

వ్యాధి వ్యాప్తి గుర్తింపు

స్ట్రైప్టోకోకల్‌ ఫారింగైటిస్‌ అని పిలిచే బ్యాక్టీరియా వల్ల పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. తొలుత దీని వల్ల జ్వరం వచ్చి రుమాటిక్‌ జ్వరంగా మారి.. అది రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌కు దారి తీస్తుందని పరిశోధనల్లో తేలింది. వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ ప్రకారం.. మగవారి కంటే ఆడపిల్లలు, మహిళల్లో రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. గర్భదారణ సమయంలో వచ్చే గుండె సమస్యల్లో రుమాటిక్‌ గుండె జబ్బులు ప్రమాదకరంగా మారుతున్నాయి.

రుమాటిక్‌ జ్వరం లక్షణాలు

ఈ వ్యాధి బారిన పడిన వారిలో శ్వాస సరిగా తీసుకోలేనప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. వేగంగా శ్వాస తీసుకోవడం అంటే గుండె రక్తాన్ని పంప్‌ చేయలేకపోతోందని, గుండె దెబ్బతినడం మొదలైందని అర్థం. దాని ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది. అందువల్ల ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతి నొప్పి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. రుమాటిక్‌ జ్వరం.. తర్వాత రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌కు దారితీస్తోంది. జ్వరం, గొంతు మంట, మోకాళ్లు, మోచేతులు, మణికట్టులో నొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారణ ఎలా?

ఈ వ్యాధి సోకితే క్రమం తప్పకుండా మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ వ్యాధికి మొదట యాంటీ బయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే, పెన్సిలిన్‌ ఇంజెక్షన్‌ కూడా ఇస్తారు.

వ్యాధి వ్యాప్తి నివారణకు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌, వైద్యులు సూచిస్తున్నారు.

Next Story