పులిపిర్లకు ఇలా చెక్‌ పెట్టండి

వివిధ అనారోగ్య సమస్యలు, వైరల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల చాలా మందిలో పులిపిర్లు వస్తుంటాయి. మెడ, ముఖంపై వచ్చే వీటిని..

By -  అంజి
Published on : 8 Dec 2025 11:30 AM IST

Health Tips, warts, warts reduce, human body

పులిపిర్లకు ఇలా చెక్‌ పెట్టండి

వివిధ అనారోగ్య సమస్యలు, వైరల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల చాలా మందిలో పులిపిర్లు వస్తుంటాయి. మెడ, ముఖంపై వచ్చే వీటిని వదిలించుకోవడం కూడా చాలా కష్టం అందుకే చాలా మంది లేజర్‌ చికిత్స ద్వారా వీటిని తొలగించుకుంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో వీటిని తొలగించుకోవచ్చు. అదెలాగంటే..

దూదిని యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అద్దాలి. వారంలో ఐదు రోజులు ఇలా చేస్తే పులిపిర్లు పూర్తిగా తగ్గిపోతాయి. యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌లో అధిక యాసిడ్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది వాడటం వల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి.

కలబంద గుజ్జును తీసుకుని తరచూ పులిపిర్లపై రాస్తే చాలు, కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి. క్రమం తప్పకుండా వారం రోజులు ఈ చిట్కా పాటిస్తే ఫలితం ఉంటుంది.

ఆముదంలో కాస్త బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్‌ వేయాలి. అలా రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.

అరటి పండు తొక్కతో రోజూ పులిపిర్లపై రుద్దితే అవి క్రమేపీ కనుమరుగవుతాయి. వెల్లుల్లి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్న చోట రాస్తే ఫలితం ఉంటుంది.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

Next Story