నువ్వులతో ఎన్నో ఉపయోగాలు.. వాటిని అదుపులో ఉంచుతుంది
Health benefits of Sesame Seeds.నువ్వులు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2021 4:09 PM ISTభారతీయులు వంటల్లో నువ్వులను ఎక్కువగా వాడుతుంటారు. వంటల్లోనే కాకుండా మామూలుగా నువ్వుల ఉండలు, నువ్వుల పోడి ఇలా రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. నువ్వులు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీగా ఆహారంలో నువ్వులను తీసుకోవడం వల్ల కొలెస్టాల్, టైగ్లసరైడ్స్ లెవల్స్ తగ్గుతాయట. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలోనూ ఎంతో తోడ్పడతాయని చెబుతున్నారు. ఉదయం పూట నువ్వులను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వల్ల అరుగుదల చాలా ఉంటుంది. డయాబెటిస్, ఒబేసిటీ వంటి వ్యాధులను నివారించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ బి6, సెల్ ఫార్మేషన్‌కు సెల్ ఫంక్షన్ అవసరం అవుతాయి. ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్ శాతం వల్ల బ్లడ్ షుగర్‌ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఈ, ప్లాంట్ కాంపౌడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పని చేసి, శరరీరంలో ఉండే ఆక్సిడేటివ్ స్టెస్‌ని తగ్గిస్తాయి. నువ్వుల్లో థయామిన్, నియాసిన్, విటమిన్ బి6 మెటబాలిజంకు ఎంతగానో సహాయపడుతుంటాయి.
నువ్వులను ప్లాంట్ ప్రొటీన్ సోర్సెస్‌లో ఒకటిగా చెబుతుంటారు వైద్య నిపుణులు. ఇందులో ఉండే ప్రొటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. కీళ్ల నొప్పుల నుంచి హర్మోన్ సమస్యల వల్ల నువ్వుల్లో ఉండే ప్రొటీన్ సహాయపడుతుంది. వీటితో పాటు రాజ్మా, శనగలు తీసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. బ్లడ్ ప్రెష్ ఎక్కువగా ఉన్న వాళ్లు ఈ నువ్వులను తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఆర్టరీస్‌లో ప్లేక్ బిల్డప్‌ని కూడా అదుపులో ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా నువ్వులను ఎక్కువగా వాడుతుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతర వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.