డయాబెటీస్ తో బాధపడేవారికి చక్కటి ఆహారం.. బ్రౌన్ రైస్

health benefits of brown rice. బ్రౌన్ రైస్ అనేది ఫైటిక్ యాసిడ్, ఫైబర్ లనే న్యూట్రియెంట్స్ ని పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సమర్థవంతంగా తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.

By Medi Samrat  Published on  8 Feb 2021 2:34 AM GMT
brown rice use

ఈ మధ్యకాలంలో, ఈ డిజార్డర్ కు గురయ్యేవారి సంఖ్య పెరుగుతూ ఉంటోంది. డయాబెటిస్ అనేది సాధారణ మెటబాలిక్ డిజార్డర్. ఇన్సులిన్ అనే హార్మోన్ ని శరీరం తగినంతగా ఉత్పత్తి చేయకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి అమాంతం పెరుగుతాయి. బ్రౌన్ రైస్ అనేది ఫైటిక్ యాసిడ్, ఫైబర్ లనే న్యూట్రియెంట్స్ ని పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సమర్థవంతంగా తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. అధిక రక్తపోటు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క అనారోగ్యకరమైన స్థాయిలు, ఒత్తిడి, మానసిక మాంద్యం, మరియు చర్మ రుగ్మతలు వంటి రోగాల నుండి ఉపశమనం కలిగించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో ఇది నిండి ఉంది.

ఇక బ్రౌన్ రైస్ అంటే అచ్చ తెలుగు లో దంపుడు బియ్యం. వడ్లను బియ్యం గా తయారు చేసేటప్పుడు వాటి పొరను ఎక్కువ గా తొలగించ కుండా ఉంచాలి. వీటినే బ్రౌన్రైస్ అంటారు. బ్రౌన్ రైస్ వైట్ రైస్ తొ పోల్చితే మంచి రుచి కలిగి ఉంటాయి.మరియు శరీరానికి అవసరం ఐన పోషకాలను అందిస్తాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. ఇది డైజెస్టివ్ జ్యూస్ లను రేగులేట్ చేసి స్టూల్ ను స్మూత్ చేస్తుంది. బ్రౌన్ రైస్ లో హై కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంది.

డిప్రెషన్ వంటి వివిధ మానసిక సమస్యలను తొలగించే సామర్థ్యం కలిగిన సహజసిద్ధమైన ఇంగ్రిడియెంట్స్ లో బ్రౌన్ రైస్ ముఖ్య స్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కూడా వారి ఆహారంలో అవసరమైన విటమిన్లు, ఫైబర్ మరియు ఖనిజాల అవసరాలను తీర్చడానికి మధుమేహం కోసం తెల్ల బియ్యం మీద పోషక-దట్టమైన బ్రౌన్రైస్ ను ఎంపిక చేస్తుందని సిఫార్సు చేస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాలైన బ్రౌన్ రైస్ ప్రత్యేక మైన రుచి తొ లబిస్తునాయి.


Next Story