సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లబ్ధిదారులకు ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించేందుకు ప్రభుత్వం 'myCGHS' యాప్‌ను ప్రారంభించింది. ఇది ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫొన్లలో ఇది పని చేస్తుంది. ఈ యాప్‌లో ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్, క్యాన్సిల్ చేసుకునే సదుపాయం ఉంటుంది. లబ్ధిదారుల ఆరోగ్య రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌ను బుధవారం ప్రారంభించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో CGHS కోసం ఈ యాప్ ఒక ముఖ్యమైన పురోగతి అని అన్నారు.
"ఇది సీజీహెచ్‌ఎస్ లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే అవసరమైన ఆరోగ్య సంరక్షణ ఫీచర్‌లకు అనుకూలమైన యాక్సెస్‌తో అధికారం ఇస్తుంది. ఈ చొరవ ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యత, ప్రాప్యతను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించాలనే ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా ఉంటుంది" అని ఆయన చెప్పారు. అధికారుల ప్రకారం.. యాప్‌లో 2-ఫాక్టర్ అథెంటికేషన్, ఎమ్‌పిన్ యొక్క కార్యాచరణ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది వినియోగదారుల డేటా యొక్క గోప్యత, సమగ్రతను కాపాడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.