పిల్లల్లో పెరుగుతున్న ఆస్తమా, హైపర్ యాక్టివిటీ.. కృత్రిమ రంగులతో చేసిన ఆహారాలే ప్రధాన కారణం!
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార పదార్ధాలలో అనేక కలరింగ్ ఏజెంట్ల వాడకాన్ని నిషేధించింది. ముఖ్యంగా పిల్లలు తరచుగా తినేవాటిపై చర్యలు తీసుకోవాలని పిలుపును ఇచ్చింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Jan 2025 12:31 PM ISTపిల్లల్లో పెరుగుతున్న ఆస్తమా, హైపర్ యాక్టివిటీ.. కృత్రిమ రంగులతో చేసిన ఆహారాలే ప్రధాన కారణం!
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార పదార్ధాలలో అనేక కలరింగ్ ఏజెంట్ల వాడకాన్ని నిషేధించింది. ముఖ్యంగా పిల్లలు తరచుగా తినేవాటిపై చర్యలు తీసుకోవాలని పిలుపును ఇచ్చింది. కృత్రిమ కలరింగ్ ఏజెంట్లు, వాటిలో కొన్ని విషపూరితమైనవి నిషేధించిన వస్తువుల జాబితాలో ఉన్నాయి, అయినా కూడా చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. కలరింగ్ ఏజెంట్లను దీర్ఘకాల వినియోగం కారణంగా, హైపర్ యాక్టివిటీ, క్యాన్సర్‌తో సహా పిల్లలలో అనేక ఆరోగ్య సమస్యలు దారి తీస్తాయి. భారతదేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మిఠాయిలు, ఆహార పదార్థాలలో ఉపయోగించే రంగులలో రోడమైన్ B (RhB) ను నిషేధించాయి.
ఫుడ్ కలర్లు ఆహారాన్ని మరింత ఆకర్షణీయంగానే కాదు.. అత్యంత ప్రమాదకరంగా మారుస్తాయి:
కలరింగ్ ఏజెంట్లు అనేక ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా చేస్తాయి. మరింత ఆకలి పుట్టించేందుకు తోడ్పడుతాయి. సాంప్రదాయకంగా, ఇంట్లో తయారుచేసిన ఆహారాలలో ప్రజలు పసుపు, బీట్‌రూట్, ఎర్ర మిరపకాయ, కుంకుమపువ్వు వంటి సహజ కలరింగ్ ఏజెంట్లను ఉపయోగిస్తారు. సాంస్కృతిక, ఆర్థిక మార్పుల కారణంగా నగరాలు, పట్టణాలలో రోడ్‌సైడ్ షాపులతో సహా పలు హోటళ్లలో కృత్రిమ ఫుడ్ కలర్స్ వాడకం పెరిగింది.
కృత్రిమ రంగు వాడకం, నిషేధం:
ECILలోని జెమ్‌కేర్ పౌలోమి హాస్పిటల్స్‌లోని శిశువైద్యుడు డాక్టర్ సౌమ్య రెడ్డి మాట్లాడుతూ, “కొన్ని కృత్రిమ కలరింగ్ ఏజెంట్‌లను ప్రభుత్వ సంస్థలు ఆమోదించాయి. అవి చాలా ప్రమాదకరం. కొన్ని కృత్రిమ రంగులు ముఖ్యంగా పిల్లలకు హానికరంగా మారాయి.” అని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు పిల్లలను ఆకర్షించే లక్ష్యంతో సృష్టించారు. వాటిని పిల్లలకు దూరంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కాటన్ క్యాండీ, గోబీ మంచూరియా తయారీలో ఉపయోగించే RhBతో సహా కొన్ని కలరింగ్ ఏజెంట్లను నిషేధించాయి.
కృత్రిమ కలరింగ్ ఏజెంట్ల ప్రమాదం:
టార్ట్రాజైన్, కార్మైన్ వంటి కలరింగ్ ఏజెంట్లు పిల్లలలో ఆస్తమాకు కారణం అవుతాయి.“కొంతమంది పిల్లలు కృత్రిమ కలరింగ్ ఏజెంట్ల వాడకం వల్ల హైపర్యాక్టివ్ పిల్లలుగా మారిపోతారు. ‘అటెన్షన్ సీకింగ్’ బారిన పడతారు. అలెర్జీలు, దద్దుర్లు, వాపులు మొదలైనవి వెంటాడుతాయి" అని డాక్టర్ సౌమ్య రెడ్డి తెలిపారు.
కార్సినోజెనిక్, జెనోటాక్సిక్ ప్రభావాలు:
కొన్ని కృత్రిమ కలరింగ్ ఏజెంట్లు క్యాన్సర్ కారక, జెనోటాక్సిక్ ప్రభావాలకు కారణమవుతాయి. పిల్లల్లో తరచుగా చిరాకు ఉంటుంది. నిద్రలేమికి గురవుతారు. "కలరింగ్ ఏజెంట్లు క్యాన్సర్, జెనోటాక్సిక్ ప్రభావంతో పాటు పిల్లలలో కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావితం చేయవచ్చు. కొంతమంది పిల్లలలో మెదడు కణితులకు దారితీసే ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు తెలిపాయి, ”అని డాక్టర్ సౌమ్య రెడ్డి చెప్పారు.
అవగాహన, సరైన పరీక్షలు అవసరం:
పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, ఫెస్టివల్స్, పలు కార్యక్రమాల్లో ఆహార పదార్థాల అమ్మకాలు తప్పనిసరి. ఆహారం నాణ్యత, ఉపయోగించే ఫుడ్ కలర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా, నిర్ధారించాల్సిన అవసరం ఉంది. “కృత్రిమ రంగులతో తయారు చేసే పదార్థాలకు పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. వివిధ ప్రభుత్వ సంస్థలు ఆహార పదార్థాలను మార్కెట్‌కి అనుమతించే ముందు వాటిని పర్యవేక్షించాలి, తనిఖీ చేయాలి, ధృవీకరించాలి, ”అని డాక్టర్ సౌమ్య రెడ్డి అన్నారు.