Summer: వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ఇవి పాటించండి!
ఎండలు మండిపోతున్నాయి. ఏదైనా పనిమీద పగటిపూట బయటకి వెళ్లాలంటే వడదెబ్బ భయం వెంటాడుతోంది. అలాగని ఏ పనీ మానుకోలేని
By అంజి Published on 9 May 2023 8:30 AM GMTSummer: వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ఇవి పాటించండి!
ఎండలు మండిపోతున్నాయి. ఏదైనా పనిమీద పగటిపూట బయటకి వెళ్లాలంటే వడదెబ్బ భయం వెంటాడుతోంది. అలాగని ఏ పనీ మానుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మండే ఎండల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
వడదెబ్బ అంటే..
సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అంతకు మించితే మన శరీరం ఇబ్బందికి లోనవుతుంది. మండు వేసవిలో శరీరం సూర్యరశ్మి వల్ల వెలువడే వేడి కారణంగా అస్వస్థతకు గురికావడాన్నే వడదెబ్బ అంటారు. ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటినప్పుడు వడదెబ్బ తగులుతుంది. 38 - 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ తగిలితే అది ప్రాణాంతకం కావచ్చు.
లక్షణాలు
నీరసపడటం, కళ్లు తిరిగి పడిపోవడం, డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరం
ప్రభావం ఇలా..
వడదెబ్బ తగిలితే.. శరీర ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ దాటుతుంది. ఈ స్థితిని హైపర్ థెర్మియా అంటారు. దీని వల్ల శరీరంలోని థెర్మోరెగ్యులేషన్ దెబ్బతిని, ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది. దీంతో ఎంజైమ్‌లు వేడెక్కి పలుచబడటం, జీవకణాల పనితీరు తగ్గడం, కండరాలాఉ వ్యాకోచించి.. ఒళ్లునొప్పులొస్తాయి. ఒంట్లోని నీరంతా ఆవిరై, నీరసం ఆవహిస్తుంది. మెదడు, గుండెకు రక్తప్రసరణ నిలిచిపోయి, కిడ్నీలు మొరాయించి, అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోయి చివరికి మనిషి మృత్యువాత పడతాడు.
చికిత్స
వడదెబ్బకు గురైన మనిషిని నీడలో కూర్చోబెట్టి నీరు తాగించాలి. తగినంత గాలి వచ్చేలా చూడాలి. వీలైనంత త్వరగా డాక్టర్ చేత సెలైన్ పెట్టించి, తగిన వైద్య సహాయం అందించాలి. సొంత చికిత్స వద్దు.
ఎండలో బయటికి వెళ్లేటప్పుడు
- ఎండలో వెళ్లేటప్పుడు టోపీ, గొడుగు వాడాలి. కాటన్ దుస్తులు ధరించాలి.
- తగినంత నీరు, చెరుకురసం, మజ్జిగ, కొబ్బరినీరు వంటివి తీసుకోవాలి.
- ప్రయాణాల్లో మాంసాహారం, మసాలాలు తగ్గించాలి.
- వెపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్స్, కాఫీ, ఆల్కహాల్, ఐస్‌క్రీమ్, కూల్స్ డ్రింక్స్‌కు దూరం ఉండటం మంచిది.
- కఠిన వ్యాయామం వద్దు. ఉదయం వేళ యోగా, తేలికపాటి వాకింగ్ చాలు.
- శిశువుకు తరచూ తల్లిపాలివ్వాలి. ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం 6 గంటల తర్వాతే స్నానం చేయించాలి.
- వృద్ధులు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు.