చేపలు ఎక్కువగా తింటే ఎలాంటి ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు
Fish benefits.. చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. చేపలు పులుసే కాదు.. వేపుడు కూడా
By సుభాష్ Published on 23 Nov 2020 7:27 PM ISTచేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. చేపలు పులుసే కాదు.. వేపుడు కూడా ఎంతో మంచిది. అయితే ఏదో ఒక రకంగా చేపలను వారంలో కనీసం రెండు, మూడు సార్లు తీసుకుంటే మనకు అనేక లాభాలున్నాయని చెబుతున్నారు.
♦ వయసు మీద పడిన వారికి మతిమరుపు ఎక్కువగా వస్తుంటుంది. కొందరిలో తీవ్రమైన అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను ఎక్కువగా తీసుకుంటే అలాంటి సమస్య నుంచి బయట పడవచ్చని 2016లో పలువురు అమెరికన్ శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో తేలింది. చేపలను ఎక్కువగా తినడం వల్ల మెదడు బాగా పని చేస్తుందట. అంతేకాదు జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
♦ చేపలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించింది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్కతంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఎంతో ఉపయోగాపడతాయని వారు వివరిస్తున్నారు.
♦ చేపలను తరచూ తినడం వల్ల చేపల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హర్మోన్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రతి నిత్యం సాధారణంగా ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి గట్టెక్కవచ్చని పరిశోధనలలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు.
♦ చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. పెద్ద పేగు, క్యాన్సర్, గొంతు క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని పేర్కొంటున్నారు.
♦ స్త్రీలలో రుతుక్రమం సమస్య అరికడుతుంది. అలాగే తురుక్రమం సమయంలో దురయ్యే అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు చేపలు ఎంతో ఉపయోగపడతాయని పరిశోధనలలో వెల్లడైనట్లు అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
♦ చేపల్లో విటమిన్ -డి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. సూర్యకాంతి ద్వారా మనకు లభించే విటమిన్‌డికి సమానంగా పోషకాలు చేపల ద్వారా లభిస్తాయి.
♦ తరచూ చేపలు తినేవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే డయాబెటిస్, పక్షవాతం నుంచి కాపాడటంలో చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి.