World Cancer Day: చికిత్స కన్నా.. అవగాహనే అవసరం
మనిషి జీవనశైలిలో రోజు రోజుకీ చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టే.. కొత్త రోగాలు వెలుగులోకి వస్తున్నాయి.
By అంజి
World Cancer Day: చికిత్స కన్నా.. అవగాహనే అవసరం
మనిషి జీవనశైలిలో రోజు రోజుకీ చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టే.. కొత్త రోగాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, మనిషి ప్రాణాంతకమైన రోగం బారిన పడితే.. దానికి భయం తోడైతే.. రోజులు దగ్గర పడ్డట్టే. అందుకే క్యాన్సర్‌కు చికిత్స కంటే అవగాహన ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. నేడు 'ప్రపంచ క్యాన్సర్' దినోత్సవం. దీనిపై అవగాహన పెంపొందించుకుని జాగ్రత్త పడదాం పదండి.
ఉద్దేశ్యం
క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. క్యాన్సర్ మహమ్మారి బారి నుంచి మానవాళిని రక్షించడం, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించడమే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ వ్యాధికి చికిత్స కంటే ముందు దానిపై అవగాహన అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ అనేది మనిషి శరీరంలోని కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే పరిస్థితి ఉంటుంది.
ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఒక థీమ్ నిర్వహిస్తుంది. 2024లో 'క్లోజ్ ది కేర్ గ్యాప్' అనే థీమ్ నిర్వహించబడుతుంది. ఈ థీమ్ సహాయంతో క్యాన్సర్ రోగులందరికీ సులభంగా చికిత్స పొందే అవకాశాన్ని కల్పించడంపై దృష్టి పెట్టడం జరిగింది. ఇది యూఐసీసీ నేతృత్వంలోని ప్రపంచ కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహనను పెంపొందించడం, జ్ఞానాన్ని పంచుకోవడం వంటి పని చేస్తుంది.