వ్యాక్సిన్‌తో మనకు మాత్రమే రక్షణ.. మాస్క్‌ పెట్టుకోకుంటే..

Coronavirus Vaccine No Side Effects. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో వ్యాధిని అరికట్టడానికి శాస్త్రవేత్తలందరూ చెబుతున్నది వ్యాక్సిన్‌తో మనకు మాత్రమే రక్షణ.. మాస్క్‌ పెట్టుకోకుంటే..

By Medi Samrat  Published on  8 Jan 2021 8:51 AM IST
corona vaccine

కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో వ్యాధిని అరికట్టడానికి శాస్త్రవేత్తలందరూ వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ కనుగొని.. అందరికీ అందుబాటులోకి తేవాలనే ప్రక్రియలను కొనసాగిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా అది కేవలం మనకు మాత్రమే రక్షణ కల్పిస్తుందని టెక్సాస్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రామిరెడ్డి తెలిపారు.

ఒకవేళ కరోనా వైరస్ మన శరీరంలో వ్యాపించి ఉంటే టీకా వేసుకోవడం ద్వారా ఆ వైరస్ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, మనం దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మన నుంచి వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని ఈయన తెలిపారు. అందువల్ల కరోనా వైరస్ కు టీకా వేయించుకున్నప్పటికి కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ వాడాలని తెలియజేశారు. ఇప్పటికే ఫైజర్ టీకా మొదటి డోస్‌ వేసుకున్న ఆయన, గురువారం మరో డోస్‌ వేసుకొనున్నారు. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఎలాంటి తీవ్రమైన సైడ్ఎఫెక్ట్స్ లేవని, వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కండరాల నొప్పులు రావడం వంటి చిన్నచిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం సర్వ సాధారణ విషయం అని డాక్టర్ రామిరెడ్డి తెలిపారు.

ఒక్కసారి టీకా వేసుకున్న తర్వాత దాదాపు ఎనిమిది నెలల పాటు ఈ వైరస్ నుంచి రక్షణ తదుపరి ఎనిమిది నెలల తర్వాత మరోసారి ఈ టీకా వేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా సెకండ్ వేవ్‌ కొనసాగుతుంది. అయితే ఈ సెకండ్ వేవ్‌ అమెరికాలో తీవ్రరూపం దాల్చటం వల్ల రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఆస్పత్రులలో వైద్యం చేయడానికి బెడ్ లు సరిపోక నేలపై పడుకుంటున్నార‌ని డాక్టర్ తెలిపారు. ఈ సెకండ్ వేవ్‌ అమెరికాలో పెరుగుతూ, ఇండియాలో తగ్గిందని ఆయన తెలిపారు. అసలు ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందో లేదో అన్న విషయం కూడా తెలియడం లేదు. ఇండియాలో ఉన్న వారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ మహమ్మారి నుంచి త్వ‌ర‌గా కోలుకోవటం వల్ల మరణాల సంఖ్య తక్కువగా ఉందని డాక్టర్ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


Next Story